Megastar Mania: మెగాస్టార్ మేనియా.. ఇండియాలోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి దూసుకెళ్లిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’

Megastar Mania: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (MSVPG) బాక్సాఫీస్ వద్ద సూపర్ రన్ కొనసాగిస్తోంది.

Update: 2026-01-16 07:10 GMT

Megastar Mania: మెగాస్టార్ మేనియా.. ఇండియాలోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి దూసుకెళ్లిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’

Megastar Mania: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (MSVPG) బాక్సాఫీస్ వద్ద సూపర్ రన్ కొనసాగిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో చిరంజీవి పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. విడుదలైన నాలుగో రోజున కూడా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఇండియాలోనే రూ.100 కోట్ల నెట్ కలెక్షన్లను దాటేసింది.

ట్రేడ్ అనలిస్ట్ వెబ్‌సైట్ సక్నిల్క్ నివేదిక ప్రకారం, సంక్రాంతి రోజు (జనవరి 15) ఈ చిత్రం ఒక్కరోజులోనే రూ.24.14 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ప్రీమియర్‌ల ద్వారా రూ.9.35 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం, తొలి రోజు రూ.32.25 కోట్లు, రెండో రోజు రూ.18.75 కోట్లు, మూడో రోజు రూ.19.50 కోట్లు, నాలుగో రోజు రూ.24.14 కోట్లు సాధించింది. దీంతో ఇప్పటివరకు ఇండియాలో మొత్తం రూ.103.99 కోట్ల నెట్ కలెక్షన్లను నమోదు చేసింది.

గురువారం రోజున తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి సగటు 75.10 శాతం ఆక్యుపెన్సీ నమోదైనట్లు సమాచారం. ఈ రికార్డు వసూళ్లతో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిరంజీవి గత సినిమాల జీవితకాల కలెక్షన్లను అధిగమించింది. ‘భోళా శంకర్’ (రూ.30.63 కోట్లు), ‘ఆచార్య’ (రూ.56.14 కోట్లు), ‘గాడ్ ఫాదర్’ (రూ.74.03 కోట్లు) వంటి సినిమాల రికార్డులను ఈ చిత్రం దాటేసింది.

ఇప్పుడు ఈ మూవీ చిరంజీవి బ్లాక్‌బస్టర్ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ ఇండియా కలెక్షన్లు రూ.161.06 కోట్లను అందుకునే దిశగా దూసుకుపోతోంది.

ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు. చిరంజీవి, నయనతారతో పాటు వెంకటేష్, కేథరిన్ ట్రెసా కీలక పాత్రల్లో నటించారు. చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ నుంచి ఈ చిత్రానికి టైటిల్ ఎంపిక చేయడం విశేషం.

కథ విషయానికి వస్తే.. ఒక జాతీయ భద్రతా అధికారి, తనకు ఆరు సంవత్సరాలుగా విడిపోయిన భార్య, పిల్లలను ప్రతీకార భావంతో ఉన్న మాజీ పోలీసు నుంచి రక్షిస్తూ, వారి మధ్య బంధాన్ని తిరిగి నిర్మించుకునే ప్రయత్నం చేయడం ఈ చిత్ర ప్రధాన కథాంశం.

భారీ విజయాన్ని పురస్కరించుకుని అదనపు షోలను కూడా యాడ్ చేశారు. అలాగే సినిమా సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకుంటూ చిరంజీవి తన జూబ్లీహిల్స్ నివాసంలో ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి దుర్గా తేజ్ సహా మెగా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అభిమానులతో కలిసి థియేటర్లలో సినిమా చూసి ఆనందం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News