ఓ ఆదివారం ఇలా... చెల్లెళ్ళు, తమ్ముళ్లతో కలిసి చిరంజీవి

ఇన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు..

Update: 2020-04-19 09:09 GMT
Megastar Chiranjeevi With Family

ఇన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు.. కరోనా వైరస్ పై ప్రజలకి అవగాహన కల్పిస్తూ తరచుగా పోస్టులు పెడుతున్నారు.. తాజాగా తన ఫ్యామిలీకి సంబంధించిన మరో ఆసక్తికర విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నాడు చిరంజీవి.. లాక్ డౌన్ కి ముందు ఆదివారం తన తల్లి అంజనాదేవి తమ్ముళ్లు పవన్ కళ్యాణ్, నాగబాబు సోదరీమణులు మాధవి, విజయదుర్గాలతో కలిసి భోజనం చేస్తున్నా పిక్ ని చిరంజీవి ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు

'లాక్‌డౌన్‌కు ముందు ఓ ఆదివారం నాడు ఇలా. ప్రియమైన వారిని కలవడం ఎంతగానో మిస్‌ అవుతున్నాను. మీలో చాలామందికి ఇలాంటి భావనే ఉందని నాకు తెలుసు. మన సాధారణమైన జీవితం త్వరలోనే మళ్లీ తిరిగి వస్తుందని నమ్ముతున్నాను. అమ్మ,నేను- చెల్లెల్లు, తమ్ముళ్లు' అని చిరంజీవి పేర్కొన్నారు. చిరు చేసిన ఈ ట్వీట్ ని మెగా అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాని చేస్తున్నారు. చిరంజీవి 152వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇందులో చిరు సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.



Tags:    

Similar News