Megastar Chiranjeevi New Look: కొత్త లుక్ పైన క్లారిటీ ఇచ్చిన చిరు!

Megastar Chiranjeevi New Look: లాక్ డౌన్ సమయంలో కొత్త లుక్ లో దర్శనం ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి.. ఇంతకుముందు ఎప్పుడు లేకుండా మీసాలు, గ‌డ్డాలు

Update: 2020-07-23 09:43 GMT
Megastar chiranjeevi new look viral

Megastar chiranjeevi reveals his new look: లాక్ డౌన్ సమయంలో కొత్త లుక్ లో దర్శనం ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి.. ఇంతకుముందు ఎప్పుడు లేకుండా మీసాలు, గ‌డ్డాలు తీసేసి క్లీన్ షేవ్ చేసి చాలా యంగ్ గా కనిపిస్తున్నారు చిరంజీవి.. అయితే ఈ ఫొటోను కూడా స్వయంగా ఆయ‌నే తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అంతేకాకుండా మేకోవ‌ర్స్ మూడ్స్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ఫోటోను చూసిన ఆయన అభిమానులు మరింతగా షాక్ అవుతున్నారు. అయితే చిరు ఈ లుక్ తన తదుపరి చిత్రం కోసం అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే అదేమీ కాదంటూ స‌ర‌ద‌గా ఈ న్యూ లుక్ ట్రై చేసిన‌ట్టు క్లారిటీ ఇచ్చారు చిరంజీవి! ఇక ఈ లుక్ బాగుంది అంటూ అభిమానులతో పాటుగా నెటిజన్లు అభిప్రయపడుతున్నారు.


ఇక చింజీవి సినిమాల విషయానికి వచ్చేసరికి గతేడాది సైరా నరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు.. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.. దాదాపుగా యాబై శాతం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కరోనా వైరస్ ప్రభావం వలన వాయిదా పడింది.. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.   

Tags:    

Similar News