Megastar Chiranjeevi's Acharya: ఆచార్య'లో మార్పులు.. చరణ్ ప్లేస్ లో మరో హీరో?

Megastar Chiranjeevi's Acharya: గతేడాది సైరా నరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే..

Krishna
Updated on: 26 Jun 2020 6:44 PM IST
Megastar Chiranjeevis Acharya: ఆచార్యలో మార్పులు.. చరణ్ ప్లేస్ లో మరో హీరో?
X

Megastar Chiranjeevi's Acharya: గతేడాది సైరా నరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.. దాదాపుగా యాబై శాతం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కరోనా వైరస్ ప్రభావం వలన వాయిదా పడింది..

అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం కొన్ని కండిషన్స్ పెట్టి సినిమా షూటింగ్ లకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.. దీనితో ఆచార్య సినిమాకి లైన్ క్లియర్ అనుకున్న సమయంలో మరో చిక్కు వచ్చి పడింది.. ముందుగా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం రామ్ చరణ్ ని అనుకున్న సంగతి తెలిసిందే కదా... అయితే ప్రస్తుతం రామ్ చరణ్ ,రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న RRR షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.. జక్కన్న ఎన్టీఆర్ , చరణ్ లపైన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. దీనితో ఆచార్య మూవీకి డేట్స్ అడ్జెస్ట్ చేయాలని పరిస్థితి చరణ్ కి ఏర్పడింది..

ఇలా చరణ్ డేట్స్ కోసం ఎదురు చూసుకుంటూ పోతుంటే ఆచార్య సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో మెగాస్టార్ చిరంజీవి ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆచార్యలో చరణ్ కోసం అనుకున్న పాత్రను మరో హీరోతో భర్తీ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో కొరటాల శివ కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్నారని టాక్.

అప్పట్లో ఈ సినిమాలో మహేష్ బాబు ఓ కీలక పాత్ర చేస్తున్నాడు అన్న టాక్ వచ్చిన సంగతి తెలిసిందే కదా..సో మళ్లీ ఆ పాత్ర కోసం మహేష్ ను మీట్ అవుతారా లేక మరో హీరోని అప్రోచ్ అవుతారా అన్నది చూడాలి మరి.. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. దేవాదాయ ధర్మాదాయ శాఖలో జరిగే అక్రమాల చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలుస్తోంది..


Krishna

Krishna

Next Story