మెగా డాటర్ నీహారిక కాబోయే భర్త ఈయనే!

మెగా డాటర్ నీహారిక..మెగాస్టార్ వారసురాలిగా ఇటు బుల్లితెర పై అటు వెండి తెరపై తనదైన ముద్ర వేసుకున్నారు. నాగబాబు తనయగా పరిచయం అయినా..నీహారిక తనదైన స్టైల్ లో అభిమానులను అలరించారు.

K V D Varma
Updated on: 19 Jun 2020 8:54 AM IST
మెగా డాటర్ నీహారిక కాబోయే భర్త ఈయనే!
X
niharika with her wouldbe (image source: niharika instagram)

మెగా డాటర్ నీహారిక..మెగాస్టార్ వారసురాలిగా ఇటు బుల్లితెర పై అటు వెండి తెరపై తనదైన ముద్ర వేసుకున్నారు. నాగబాబు తనయగా పరిచయం అయినా..నీహారిక తనదైన స్టైల్ లో అభిమానులను అలరించారు. కొన్ని రోజులుగా ఆమె వివాహానికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి. ఆమె పెళ్లి ముచ్చట్ల కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఈమధ్య నీహారిక వరుసగా ఇంస్తాగ్రాం లో పోస్టులు పెడుతూ వస్తున్నారు. మిస్ నీహారిక అని ఉన్న క్యాప్షన్ కొట్టేసి.. మిసెస్ నీహారిక అని రాసిన ఫోటోతో ఆమె వివాహం ఖాయం అయిపోయిందని తెలిసిపోయింది. తరువాత తాను, తన కాబోయే భర్త తో కలసి ఉన్న ఫోటో షేర్ చేశారు నీహారిక. అయితే, అందులో వరుడి ముఖం కనిపించకుండా ఉండడం తో అభిమానులు నిరాశకు గురయ్యారు. దీంతో తాజాగా ఆమె తన కాబోయే భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేశారు.

నీహారిక కాబోయే భర్త పేరు జొన్నల గడ్డ చైతన్య. గుంటూరులో ఐజీ స్థాయిలో పనిచేస్తున్న ఐపీఎస్ ఆఫీసర్ కుమారుడు. ఈయన ప్రస్తుతం ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్నారు. ఇక వీరికి నిశ్చితార్థం ఈ ఆగస్తులోనూ, పెళ్లి వచ్చే ఈ సంవత్సరం డిసెంబర్ లేదా వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో జరగొచ్చని తెలుస్తోంది.

K V D Varma

K V D Varma

Next Story