నీహారిక పెళ్లిపై నాగబాబు క్లారిటీ! వాళ్ళిద్దర్నీ అలా చూడాలనుకున్నా కుదరలేదు!!

Arun Chilukuri
Published on: 13 May 2020 5:32 PM IST
నీహారిక పెళ్లిపై నాగబాబు క్లారిటీ! వాళ్ళిద్దర్నీ అలా చూడాలనుకున్నా కుదరలేదు!!
X

మెగా డాటర్ నిహారిక పెళ్లిపై స్పందించారు నాగబాబు. నిహారికాకి ప్రస్తుతం సంబంధాలు చూస్తున్నాం. దాదాపు వచ్చే ఏడాది మొదటిలోనే ఆమె పెళ్లిని జరిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఆ వెంటనే వరుణ్‌ తేజ్‌కి మంచి సంబంధం చూసి పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

పిల్లల పెళ్లిళ్లు అనే బాధ్యత ప్రస్తుతం నాపై వుంది ఆ బాధ్యత నుంచి బయటపడితే నేను ఫ్రీ అవుతాను. వరుణ్ తేజ్ ను ఐపీఎస్ గా చూడాలనే కోరిక ఉండేది. అలాగే నిహారికను డాక్టర్ గా చూడాలనుకున్నాను. కానీ నా ఇష్టాన్ని వాళ్లపై రుద్ద దలచుకోలేదు. వాళ్లకి ఇష్టమైన మార్గంలో వెళ్లడానికి నా వంతు సహకారాన్ని అందించాను అని చెప్పుకొచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story