Megastar Chiranjeevi: ఆసక్తికరమైన టైటిల్స్ తో అలరించనున్న మెగా స్టార్
Megastar Chiranjeevi: యువ హీరోల కంటే ప్రస్తుతం చిరంజీవి చేతుల్లో ఎక్కువ సినిమాలు ఉన్నాయి అనడంలో అతిశయోక్తి లేదు.
Megastar Chiranjeevi: ఆసక్తి కరమైన టైటిల్స్ తో అలరించనున్న మెగా స్టార్
Megastar Chiranjeevi: దశాబ్దం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి "ఖైదీ నెంబర్ 150" సినిమా తో భారీ రేంజ్ లో కమ్ బ్యాక్ ఇచ్చారు. ఆ తర్వాత "సైరా" సినిమాకి కొన్ని నెలలు గ్యాప్ తీసుకున్న చిరంజీవి మాత్రం ఇకపై ఆగేది లేదు అంటూ వరుస సినిమాలతో బిజీ అయిపోతున్నారు. యువ హీరోల కంటే ప్రస్తుతం చిరంజీవి చేతుల్లో ఎక్కువ సినిమాలు ఉన్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న "ఆచార్య" సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది. మరోవైపు మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ చిత్రాన్ని చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆ సినిమాకి "గాడ్ ఫాదర్" అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
చిరంజీవి కెరీర్ లో 154వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాకి "భోళా శంకర్" అనే టైటిల్ ను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న మెహర్ రమేష్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. #చిరు155 సినిమాకి దర్శకనిర్మాతలు "వాల్టేర్ వీరయ్య" అనే ఒక ఆసక్తికరమైన టైటిల్ ను అనుకుంటున్నారట. "వెంకీ మామ" ఫేమ్ బాబి అలియాస్ కే. ఎస్. రవీంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది మాత్రమే కాక చిరంజీవి తన 156వ సినిమా కామెడీ సినిమాలు తీయడంలో దిట్ట అయిన మారుతి దర్శకత్వంలో చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు వి వి వినాయక్ కూడా మెగాస్టార్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు.