నా ప్రాణమైన అభిమానులకి కృతజ్ఞతలు.. చిరు ఎమోషనల్ పోస్ట్ !

Chiraanjeevi Emotional Tweet: మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినిమా చరిత్రకు దొరికిన ఓ నూతన అధ్యాయం.. ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, శోభన్ బాబు

Update: 2020-09-22 07:58 GMT

Chiranjeevi Completed 42 years

Chiraanjeevi Emotional Tweet: మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినిమా చరిత్రకు దొరికిన ఓ నూతన అధ్యాయం.. ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, శోభన్ బాబు లాంటి దిగ్గజాలు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో హీరోగా నిలుదోక్కుకున్నాడు చిరంజీవి.. తనదైన నటన, డాన్స్, ఫైట్స్ తో ఓ ట్రెండ్ క్రియేట్ చేశారు. ఒక్కో సినిమాతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తూ స్వయంకృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ గా ఎదిగారు చిరంజీవి. అలాంటి చిరంజీవిని చూసి చాలా మంది హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇండస్ట్రీలో చిరు ప్రస్థానానికి నేటితో 42ఏళ్ళు నిండిపోయాయి.. ఈ సందర్భంగా చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

"నా జీవితంలో ఆగస్ట్‌ 22 కి ఎంత ప్రాముఖ్యత వుందో.. సెప్టెంబర్‌ 22 కి కూడా అంతే ప్రాముఖ్యత వుంది. ఆగష్టు 22 నేను మనిషిగా ప్రాణం పోసుకున్న రోజైతే, సెప్టెంబర్‌ 22 నటుడిగా "ప్రాణం (ఖరీదు) "పోసుకొన్న రోజు. నా తొలి చిత్రం విడుదలైన రోజు. నన్ను ఇంతగా ఆదరించి ఈ స్థాయికి చేర్చిన సినీ ప్రేక్షక్షులందరికి, ముఖ్యంగా నా ప్రాణానికి ప్రాణమైన నా అభిమానులందరికి ఈ సందర్బంగా మనస్సూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను" అని చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.


ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమాని చేస్తున్నాడు.. ఇది చిరంజీవికి 152వ చిత్రం కావడం విశేషం.. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాజల్ అగర్వాల్ కథానాయకగా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. చిరంజీవి పుట్టిన రోజు (ఆగస్టు 22) సందర్భంగా సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం.. ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం వలన సినిమా వాయిదా పడింది. త్వరలోనే సినిమా మళ్ళీ పట్టాలేక్కనుంది.

Tags:    

Similar News