కరోనాపై పోరు : ఆచార్య వాయిదాపై చిరంజీవి కీలక నిర్ణయం..
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిరంజీవి ప్రకటించారు. అయితే తాజాగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రంగాల వారి సహకారం కావాలని సీఎం కేసీఆర్ పిలుపినిచ్చారు. అయితే క్రీడలను వాయిదా వేయడం, స్కూల్స్, కళాశాలలకు సెలవులు ప్రకటించడంతోపాటు మాల్స్, సినిమా థియేటర్లను మూసివేయడం తదితర చర్యలు తీసుకోవడం చర్యలు తీసుకోవాని కేసీఆర్ పిలుపునిచ్చారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ అందరిలో ధైర్యాన్ని పెంచే విధంగా చర్యలు తీస్కుంటున్నందుకు ధన్యవాదాల తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కూడా కొన్ని ముందస్తు నివారణా చర్యలు తీసుకున్నట్లు తెలిసిందని ఆయన అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చిరంజీవి పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో సినిమా షూటింగులలో భారీ సంఖ్యలో సాంకేతిక నిపుణులు పాల్గొంటారని, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని 10 నుంచి 15 రోజుల పాటు షూటింగ్స్ వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని దర్శకుడు కొరటాల శివతో చెప్పినప్పుడు ఆయన అంగీకరంచారని చిరంజీవి తెలిపారు.
కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స అందిస్తూనే అది మరింత వ్యాప్తి చెందకుండా, జన సమూహం లేకుండా తగు చర్యలు తీసుకోవడాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆహ్వానించారు. మాల్స్, స్కూల్స్, అన్ని మూసివేయండం మంచిదని ఆయన పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంచి వ్యూహాన్ని అవలంభిస్తోన్నాయని కొనియాడారు.
ప్రభుత్వాలకే కరోనా నియంత్రణ చేస్తాయని వదిలేయకుండా ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని సూచించారు. అందరిలో చైతన్యం కలిగించాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను అని చిరంజీవి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం రాత్రి ఓ ప్రకటనలో చిరంజీవి పేర్కొన్నారు.