Mega 157: మెగా– అనిల్ కాంబో నుంచి భారీ అప్డేట్.. ఎప్పుడంటే?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 157పై భారీ అంచనాలు ఉన్నాయి. కామెడీ ట్రాక్‌లో వస్తోన్న ఈ సినిమా ప్రతి అప్డేట్‌తో హైప్ పెంచుకుంటూ పోతుంది. తాజాగా అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, ఓ సాలీడ్ అప్డేట్ రాబోతోందని వెల్లడించాడు.

Update: 2025-08-08 16:49 GMT

Mega 157: మెగా– అనిల్ కాంబో నుంచి భారీ అప్డేట్.. ఎప్పుడంటే?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 157పై భారీ అంచనాలు ఉన్నాయి. కామెడీ ట్రాక్‌లో వస్తోన్న ఈ సినిమా ప్రతి అప్డేట్‌తో హైప్ పెంచుకుంటూ పోతుంది. తాజాగా అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, ఓ సాలీడ్ అప్డేట్ రాబోతోందని వెల్లడించాడు. ఆ అప్డేట్‌ కూడా మెగాస్టార్ బర్త్‌డే అయిన ఆగస్టు 22న రిలీజ్ కానుందని చెప్పాడు. దీంతో ఆ రోజు టీజర్ వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం సినిమా షూటింగ్ స్పీడ్‌గా కొనసాగుతోంది. ఇటీవలే కేరళ షెడ్యూల్ పూర్తిచేసుకున్న టీమ్, హైదరాబాద్‌కు చేరుకుంది. ఇందులో చిరంజీవి వింటేజ్ లుక్‌లో కనిపించనున్నారని టాక్. రీ–ఎంట్రీ తర్వాత చిరు చేస్తున్న ఫస్ట్ కామెడీ మూవీ ఇదే కావడం ప్రత్యేకత. గతంలో ఎన్నో హిట్ కామెడీ సినిమాలతో అలరించిన చిరు, మళ్లీ అదే మాజిక్ చూపించబోతున్నారని ఫ్యాన్స్‌లో భారీ ఎక్సైట్మెంట్ ఉంది.

Tags:    

Similar News