16 ఏళ్ల వయస్సులో ఇండస్ట్రీ హిట్.. 40 ఫ్లస్‌లో అదే హీరోతో మరో హిట్.. ఆ హీరోయిన్ ఎవరంటే..

అప్పట్లో హీరోయిన్లకు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అద్భుతమైన నటన, డ్యాన్స్‌తో తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసేవారు.

Update: 2025-02-20 09:18 GMT

16 ఏళ్ల వయస్సులో ఇండస్ట్రీ హిట్.. 40 ఫ్లస్‌లో అదే హీరో మరో హిట్.. ఆ హీరోయిన్ ఎవరంటే..

Meena gets Industry hit at the age of 16 in telugu

Meena: అప్పట్లో హీరోయిన్లకు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అద్భుతమైన నటన, డ్యాన్స్‌తో తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసేవారు. అలా ఇండస్ట్రీలో చాలా కాలం పనిచేసిన చేస్తున్న హీరోయిన్లు ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉన్నారు. రమ్యకృష్ణ, రాధిక, విజయశాంతి, మీనా వంటి వారు ఇప్పటికీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. వారి తర్వాత త్రిష, కాజల్ సుదీర్ఘంగా కెరీర్ కొనసాగిస్తున్నారు. టాలీవుడ్‌లో దాదాపు స్టార్ హీరోలందరితో నటించి ఎక్కువ కాలం కెరీర్‌ను కొనసాగిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. 16 ఏళ్ల వయస్సులోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఏకైక హీరోయిన్ అంటూ తాజాగా సోషల్ మీడియాలో మీనా గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. మరి ఈ న్యూస్ ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ.. అదే తెలుగు హీరోతో 40 ప్లస్‌లో మరో సూపర్ హిట్ కొట్టడం నిజంగా గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకీ ఆ సినిమాలు ఏంటి, హీరో ఎవరో చూద్దాం.

చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించిన మీనా టీనేజ్‌తోనే హీరోయిన్‌ అయిపోయారు. పదిహేనేళ్ల వయస్సులోనే సీతారామయ్యగారి మనవరాలు సినిమాలో ఛాన్స్ కొట్టేశారు. అక్కినేని నాగేశ్వరరావు మనవరాలిగా నటించి మెప్పించారు మీనా. ఈ మూవీతో మీనా కెరీర్‌యే మారిపోయింది. 1991లో విడుదలైన సీతారామయ్యగారి మనవరాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత ఏడాదికి విక్టరీ వెంకటేష్‌తో చంటి సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకున్నారు. ఈ సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం, ఇళయరాజా సంగీతం ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేశాయి. దీంతో చంటీ మూవీ రికార్డులు కొల్లగొట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

దీంతో 16 ఏళ్ల వయసులోనే మీనా ఖాతాలో ఇండస్ట్రీ సక్సెస్ పడింది. ఇక ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. నాగార్జున, వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్ఠార్ హీరోలతో వరుసగా సినిమాలు చేశారు. ఇప్పటికీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే 16 ఏళ్ల వయస్సులో వెంకటేష్‌తో కలిసి నటించిన మీనా.. 40 ప్లస్ వయస్సులోనూ వెంకీతో కలిసి నటించారు. వీరిద్దరు చివరగా కలిసి నటించిన దృశ్యం2. ఈ మూవీ కూడా భారీ విజయాన్ని అందుకుంది. మీనా, వెంకటేష్‌ది సూపర్ హిట్ పెయిర్. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చంటి, సుందరకాండ, సూర్య వంశం, అబ్బాయిగారు, దృశ్యం1, దృశ్యం2 చిత్రాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.

Tags:    

Similar News