Mayasabha: ఐదు భాషల్లో ముందస్తుగా స్ట్రీమింగ్‌లోకి వచ్చిన వెబ్‌సిరీస్‌

ఆది పినిశెట్టి, చైతన్య రావు ముఖ్య పాత్రల్లో నటించిన పొలిటికల్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌ ‘మయసభ’ (Mayasabha) అనూహ్యంగా నిర్ణీత సమయానికి ముందే స్ట్రీమింగ్‌కి వచ్చింది.

Update: 2025-08-06 16:22 GMT

Mayasabha: ఐదు భాషల్లో ముందస్తుగా స్ట్రీమింగ్‌లోకి వచ్చిన వెబ్‌సిరీస్‌

ఆది పినిశెట్టి, చైతన్య రావు ముఖ్య పాత్రల్లో నటించిన పొలిటికల్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌ ‘మయసభ’ (Mayasabha) అనూహ్యంగా నిర్ణీత సమయానికి ముందే స్ట్రీమింగ్‌కి వచ్చింది. కొద్ది రోజుల క్రితం మేకర్స్‌ ఈ సిరీస్‌ను ఆగస్ట్ 7న విడుదల చేస్తామని ప్రకటించగా, తాజాగా బుధవారం సాయంత్రం నుంచే SonyLiv ఓటీటీలో ఈ సిరీస్‌ను అందుబాటులోకి తెచ్చారు.

తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది. మొత్తం 9 ఎపిసోడ్‌లు ఉండే ఈ సిరీస్‌లో కొన్ని ఎపిసోడ్‌లు 30 నిమిషాల పాటు ఉండగా, మరికొన్ని 50 నిమిషాల రన్‌టైమ్‌ కలిగి ఉన్నాయి.

ఈ కథలో ఇద్దరు స్నేహితులు రాజకీయ విరోధులుగా ఎలా మారారు అనే కథాంశం ఆధారంగా నడుస్తుంది. ఈ పాత్రల వేషధారణలు తెలుగు ప్రజలకు సుపరిచితమైన రాజకీయ నేతలను గుర్తు చేస్తాయనే కారణంగా నెట్టింట విపరీతంగా చర్చ సాగింది. దీనిపై దర్శకుడు దేవా కట్టా స్పందిస్తూ — బయోపిక్‌లు అయినా కల్పిత కథలే అని, తాను చెప్పినది కేవలం ఒక కథ మాత్రమేనని స్పష్టం చేశారు.

ఆది పినిశెట్టి పోషించిన ‘కృష్ణ నాయుడు’ పాత్ర ఒక పేదరాజకీయ నాయకుడిగా ఎదిగిన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. ఈ సిరీస్‌ ఇప్పుడు రాజకీయ నేపథ్యం ఉన్న కథల్ని ఆసక్తిగా చూడే వారికి ఓ కొత్త కోణాన్ని అందించనుంది.

Tags:    

Similar News