OTT Movie: బ్లేడ్‌తో కోసి, నోట్లో అర‌టి పండు పెట్టి..ఓటీటీలో సైకో థ్రిల్ల‌ర్ మూవీ..!

OTT Movie: సైకో థ్రిల్లర్, క్రైమ్ నేపథ్యంలో రూపొందిన సినిమాలకు భారీగా ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.

Update: 2025-05-16 13:16 GMT

OTT: బ్లేడ్‌తో కోసి, నోట్లో అర‌టి పండు పెట్టి..ఓటీటీలో సైకో థ్రిల్ల‌ర్ మూవీ

OTT Movie: సైకో థ్రిల్లర్, క్రైమ్ నేపథ్యంలో రూపొందిన సినిమాలకు భారీగా ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. మరీ ముఖ్యంగా ఓటీటీ అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత ఇలాంటి చిత్రాల‌కు డిమాండ్ పెరుగుతోంది. తాజాగా ఇలాంటి ఓ ఆస‌క్తిక‌ర‌మైన సినిమా ఓటీటీలో సంద‌డి చేస్తోంది.

తాజాగా మలయాళంలో ఘనవిజయం సాధించి, ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'మరణమాస్' పేరుతో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం సోనీ లివ్ వేదికగా మలయాళంతో పాటు తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ చిత్రంలో బాసిల్ జోసెఫ్, రాజేష్ మాధవన్ ముఖ్య పాత్రల్లో నటించారు. దర్శకత్వం శివ ప్రసాద్ చేపట్టగా, టొవినో థామస్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. డార్క్ హ్యూమర్, థ్రిల్, వ్యంగ్యం కలిసిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగించేలా ఉంది.

కథలోకి వెళితే...

కేరళలోని ఓ పల్లెటూరులో ఓ సైకో కిల్ల‌ర్ వృద్ధులను టార్గెట్ చేస్తూ వ‌రుస హత్యలు చేస్తుంటాడు. ప్రతి హత్యకూ అతను ఒక ప్రత్యేక స్టైల్‌ను అనుసరిస్తాడు – ముఖం మీద బ్లేడ్‌తో గాయాలు చేసి, నోట్లో అరటి పండు పెట్టడం. ఈ హత్యలతో గ్రామంలో భయానక వాతావరణం ఏర్పడుతుంది.

ఈ కేసును ఛేదించేందుకు పోలీస్ ఆఫీసర్ అజయ్ రామచంద్రన్ రంగంలోకి దిగుతాడు. ఇదే సమయంలో ల్యూక్ అనే యువకుడు, జెస్సీ అనే కిక్‌బాక్సర్‌ను ప్రేమిస్తుంటాడు. ఒక ఘటనలో ల్యూక్‌ను పోలీసులు సీరియల్ కిల్లర్‌గా అనుమానిస్తారు. దీంతో జెస్సీ అతనిని దూరం చేసుకుంటుంది.

ఓ రోజు బస్సులో జెస్సీ, ఓ వృద్ధుడితో ఘర్షణలో పడుతుంది. అతని తీరుపై కోపంతో ఆమె పెప్పర్ స్ప్రే ఉపయోగించడంతో ఆ వృద్ధుడు మృతి చెందుతాడు. ఆ సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్‌తో పాటు ఇంకో వ్యక్తి కూడా ఉంటాడు. అపుడే అక్కడికి ల్యూక్ వ‌స్తాడు. ఆ డెడ్‌బాడీని ఎలా మాయం చేయాలన్నదానిపై చర్చ జరుగుతుంది. ఇదే సమయంలో అసలు సీరియల్ కిల్లర్ ఎవరో బయటపడతాడు.

సస్పెన్స్ మలుపులు...

సీరియల్ కిల్లర్ ఎవరు? ల్యూక్ నిజంగా నేరగాడేనా లేదా? అతడిని అసలు ఎందుకు టార్గెట్ చేశారు? జెస్సీ, డ్రైవర్, కండక్టర్, ల్యూక్ చివరకు ఎలా బయటపడ్డారు? వరుస హత్యల వెనుక నిజమైన కారణాలేంటి? అనే అంశాలన్నీ ఉత్కంఠభరితంగా సాగుతాయి.

Tags:    

Similar News