Swara Sagar Mahathi: గాయనిని పెళ్ళాడనున్న సంగీత దర్శకుడు
Swara Sagar Mahathi: ఘనంగా జరిగిన మణి శర్మ తనయుడి నిశ్చితార్థం
మని శర్మ తనయుడు స్వరాగ్ సాగర్ మహతి (ఫైల్ ఇమేజ్)
Swara Sagar Mahathi: మెలోడీ బ్రహ్మ గా పిలవబడే ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ తనయుడు, యువ సంగీత దర్శకుడు అయిన మహతి స్వరసాగర్ ఇప్పుడు ఒక ఇంటివాడు అయ్యారు. "ఛలో", "భీష్మ", "మాస్ట్రో" వంటి సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించి యువ సంగత దర్శకుడిగా, తండ్రికి తగ్గ తనయుడు గా మహతి తన ప్రతిభను చాటేశారు. మహతి స్వర సాగర్ నిశ్చితార్థం నిన్న గాయని సంజన కలమంజతో జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ వేడుక కి దగ్గర స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు మాత్రమే విచ్చేశారు.
ఈ వేడుక కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సంజనా కలమంజే కూడా ప్రముఖ గాయని. తెలుగు, తమిళ్, మలయాళ భాషల చిత్రాలలో చాలానే పాటలు పాడారు. మూడు భాషల్లోనూ గాయని గా మంచి పేరు తెచ్చుకున్న సంజన, సాగర్ సంగీతం అందించిన భీష్మ లో "హేయ్ చూసా" పాటను పాడింది. ఇక వీరిది ప్రేమ వివాహమా? కాదా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. త్వరలోనే వీరి పెళ్లి ఘనంగా జరగబోతుందని సమాచారం.