Ginna Movie: భారీగా ఫెయిల్ అయిన జిన్నా..

Ginna Collections: ఈ వారం థియేటర్లలో నాలుగు సినిమాలు విడుదలయ్యాయి.

Update: 2022-10-22 11:35 GMT

Ginna Movie: భారీగా ఫెయిల్ అయిన జిన్నా..

Ginna Collections: ఈ వారం థియేటర్లలో నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అందులో మొదటిది కోలీవుడ్ హీరో కార్తీ హీరోగా నటించిన "సర్దార్". ప్రీ ఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. విడుదలైన మొదటి రోజు నుంచే మంచి రెస్పాన్స్ ను అందుకుంటున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే కోటి రూపాయల దాకా కలెక్షన్లు అందుకుంది. ఈ వారం విడుదలైన రెండవ సినిమా "ఓరి దేవుడా". అశ్వంత్ మారిముత్తు దర్శకత్వంలో విశ్వక్ సేన్ మరియు మిథిలా పాల్కర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయినా "ఓ మై కడవులే" సినిమా కి రీమేక్ గా విడుదలైంది.

విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో దేవుడి పాత్రలో కనిపించగా ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటుంది. ఇక తమిళ్ హీరో ప్రిన్స్ శివ కార్తికేయన్ హీరోగా నటించిన "ప్రిన్స్" కూడా థియేటర్లలో విడుదలైంది. మారియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సత్యరాజ్ కీలక పాత్రలో కనిపించారు. "జాతి రత్నాలు" ఫేమ్ అనుదీప్ కే వీ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదలై మంచి రెస్పాన్స్ ను అందుకుంది.

మరోవైపు మంచు విష్ణు హీరోగా సన్నీలియోన్ మరియు పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా కూడా అక్టోబర్ 21న విడుదలైంది. కానీ ప్రేక్షకులు ఏమాత్రం మెప్పించలేకపోయింది. ఈ వారం నాలుగు సినిమాలు విడుదల కాగా అందులో మూడు సినిమాలు కోటి రూపాయల రేంజిలో కలెక్షన్లు అందుకోగా "జిన్నా" మాత్రం ఏకంగా కేవలం 10 లక్షల మాత్రమే నమోదు చేసుకోగలిగింది.

Tags:    

Similar News