Manchu Mohan babu: మంచు మనోజ్‌కు పంపించిన ఆడియోలో మోహన్ బాబు సంచలన ఆరోపణలు
Manchu Mohan babu audio to Manchu Manoj over jalpalli farm house property: మంచు మోహన్ బాబు, మంచు విష్ణుల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. మోహన్ బాబుపై మంచు విష్ణు, మంచు విష్ణుపై మోహన్ బాబు పరస్పరం కేసులు పెట్టుకునే వరకు పరిస్థితి వెళ్లింది. ఇప్పుడిది మీడియాలోనూ హాట్ టాపిక్ అయింది. దీంతో మంచు మనోజ్ ను ఉద్దేశించి మాట్లాడుతూ మోహన్ బాబు పంపించిన ఒక ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఆడియోలో మోహన్ బాబు మాట్లాడిన తురు ఇలా ఉంది. "మనోజ్ నువ్వు నా బిడ్డవు. నిన్ను ఎలా పెంచానురా నేను. అందరికంటే ఎక్కువ గారాబంగా పెంచాను. అందరికంటే నీకే ఎక్కువ ఖర్చుపెట్టి చదివించాను. బిడ్డలు గుండెల మీద తన్నాడంటారు కదా.. నువ్వే అలానే చేశావు. నీ ప్రవర్తన చూసి మీ అమ్మ కుమిలిపోతూ ఆస్పత్రిలో చేరింది. నీ వల్లే మీ అమ్మ ఆస్పత్రిపాలైంది. నీకు అన్నీ ఇచ్చినా కూడా నాకు మాత్రం నువ్వు ఇవాళ ఎంతో అపఖ్యాతి తీసుకొచ్చావు. ఎంత మంచి నటుడివి నువ్వు. నీ భార్య మాట విని మద్యానికి బానిసయ్యావు. తాగుడుకు అలవాటు పడి నువ్వు, నీ భార్య ఇంట్లో ప్రవర్తిస్తున్న తీరును ఆ సర్వేశ్వరుడే చూస్తున్నాడు" అని అన్నారు.
నువ్వెందుకు ఇలా తయారయ్యావు? ఎందుకు ఇంట్లో పనివాళ్లను కొడుతున్నావు? వాళ్లు పనికోసం మన ఇంటికి వచ్చారు. నేను ఇంట్లో లేని సమయంలో ఇంట్లో ఉన్న పని వాళ్లను కొడుతున్నావు. అలాంటివి చూడలేక నేనే నిన్న ఇంట్లోంచి వెళ్లి బయట ఉండమని చెప్పాను. అప్పుడు నేనే తప్పు చేయను డాడీ అని చెప్పి మళ్లీ ఇంటికొచ్చావు. కానీ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు" అంటూ మనోజ్‌ను ఉద్దేశించి అనేక ఆరోపణలు చేశారు.