సంవత్సరంలో పండగలన్నీ ఒక్క రోజులోనే వచ్చాయి.. 'వకీల్‌సాబ్‌' ఫస్ట్‌లుక్‌పై మనోజ్ రియాక్షన్

Update: 2020-03-03 17:04 GMT
manchu manoj about vakeel saab movie

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌ హీరోగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌'. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్ సోమవారం చిత్ర బృందం విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ లుక్ విడుదల కావడంతో అభిమానులు, పలువురు సినీ ప్రముఖలు స్పందిస్తున్నారు. 

మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్ కాకుండా ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ అంటే అభిమానించే నితిన్, నిఖిల్, ఫస్ట్ లుక్ పై స్పందిస్తున్నారు. వీరితో పాటు మంచు మనోజ్ కూడా సమయం వచ్చిన ప్రతీసారి పవన్ పై తన అభిమానాన్ని చాటుతుంటాడు.

ప్రేక్షకుడి మాదిరే ఎంతో ఆసక్తిగా పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు మంచు మనోజ్. ఈ సందర్బంగా మనోజ్ ట్వీట్ చేశారు. మూవీ ఫస్ట్ లుక్‌పై తనదైన శైలిలో స్పందించారు. ఏడాదిలో పండుగలన్ని ఒకే రోజు వచ్చినట్లు ఉందని ఫ్యాన్స్ లో ఉత్సాహాం నింపే ప్రయత్నం చేశారు. మనోజ్ ట్వీట్ చూస్తే.. "సంవత్సరంలో ఉన్న పండగలన్నీ అభిమానులు ఒక్క రోజులోనే జరుపుకునేలా ఉందిగా పోస్టర్ త్వరలోనే తెరమీద కనపడనున్న జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి, 'వకీల్‌సాబ్‌' టీమ్‌కి నా బెస్ట్ విషెస్' అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు . ఈ ట్వీట్ ద్వారా మరోసారి పవన్‌పై ఉన్న అభిమానాన్నిచాటుకున్నారు.

మనోజ్ ట్వీట్ పై పవన్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మరికొందరూ అభిమానులు అయితే "అన్నా.. మీరు నిజంగా సూపర్, అన్న(పవన్ ) సినిమా తరువాత మీ మూవీ కోసమే ఎదురుచూస్తున్నాం. మంచి మనసున్న మంచు వారి మంచోడి మాట మా మనసులను ఆనందంలో ముంచిందనడంలో సందేహం లేదు...ధన్యవాదాలు మనోజ్ అన్నా...మరోసారి నీ నిష్కల్మషమైన మాటలతో మా మనసులను గెలిచావ్... అంటూ పవన్ కళ్యాన్ ఫ్యాన్స్

దిల్‌రాజు ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. రెండేళ్లు క్రితం పవన్‌ చివరిగా 2018లో 'అజ్ఞాతవాసి'లో నటించారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఆ తర్వాత ఆయన మరో సినిమా చేయలేదు. తాజాగా వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను వేసవిలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. 



Tags:    

Similar News