గన్ మెన్లు ఇవ్వండి: ఇంటలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని కోరిన మంచు మనోజ్
Manchu Manoj: తమకు గన్ మెన్లను ఇవ్వాలని తెలంగాణ ఇంటలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని కోరారు మంచ్ మనోజ్ (manchu manoj), ఆయన భార్య మౌనిక (Manchu Mounika). మంగళవారం సాయంత్రం ఇంటలిజెన్స్ బాస్ ను ఆయన కార్యాలయంలో మనోజ్ కలిశారు.
గన్ మెన్లు ఇవ్వండి: ఇంటలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని కోరిన మంచు మనోజ్
Manchu Manoj: తమకు గన్ మెన్లను ఇవ్వాలని తెలంగాణ ఇంటలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని కోరారు మంచ్ మనోజ్ (manchu manoj), ఆయన భార్య మౌనిక (Manchu Mounika). మంగళవారం సాయంత్రం ఇంటలిజెన్స్ బాస్ ను ఆయన కార్యాలయంలో మనోజ్ కలిశారు. తమ ఇంట్లో జరుగుతున్న పరిణామాలను మనోజ్ వివరించారు.
మంచు మోహన్ బాబు (manchu mohanbabu) కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. తనపై గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారని మనోజ్ డిసెంబర్ 9న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు చేసిన వెంటనే మోహన్ బాబు కూడా రాచకొండ సీపీ సుధీర్ బాబుకు ఫిర్యాదు చేశారు.
తనకు మనోజ్, మౌనిక ల నుంచి ప్రాణభయం ఉందని ఆ ఫిర్యాదులో తెలిపారు. తనకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దుబాయ్ నుంచి మంచు విష్ణు (manchu విష్ణు) ఇవాళ హైద్రాబాద్ కు వచ్చారు.
విష్ణు ఇంటికి వచ్చిన తర్వాత మనోజ్ మీడియాతో మాట్లాడారు. తాను ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నానని చెప్పారు. ఆస్తులు, డబ్బుల కోసం పోరాటం చేయడం లేదన్నారు. తనను తొక్కేసేందుకు తన భార్య పేరును తెరమీదికి తెస్తున్నారని ఆయన ఆరోపించారు. తనకు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తానని ఆయన చెప్పారు.