Manchu Manoj: మంచు కుటుంబ కలహాల గురించి షాకింగ్ జవాబు ఇచ్చిన మనోజ్
Manchu Manoj: గొడవ గురించి అడిగితే కౌంటర్ వేసిన మంచు మనోజ్
Manchu Manoj: మంచు కుటుంబ కలహాల గురించి షాకింగ్ జవాబు ఇచ్చిన మనోజ్
Manchu Manoj: ఈ మధ్యకాలంలో ఏదో ఒక కారణంతో మంచు కుటుంబం సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తోంది. గతంలో తమ సినిమాలతో మాట్లాడిన మంచు హీరోలు ఈమధ్య కేవలం వివాదాలతో మాత్రమే వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఇప్పుడు మంచు మనోజ్ కూడా వివాదాలు మరియు కుటుంబ కలహాల వల్ల వార్తల్లో నిలుస్తున్నారు. ఈ మధ్యనే తన తండ్రి మంచు మోహన్ బాబుతో పాటు మంచు మనోజ్ హాస్పిటల్ ఓపెనింగ్ కి వెళ్లారు.
అక్కడ మీడియాతో మాట్లాడుతున్న ఈ మంచు తండ్రి కొడుకులకు మంచు కుటుంబంలో జరుగుతున్న గొడవలు గురించిన ప్రశ్న ఎదురైంది. దాని గురించి జవాబు ఇవ్వకుండా మంచు మనోజ్ మీడియా వ్యక్తిపై అసభ్యకరంగా మాట్లాడటం ఇప్పుడు అభిమానులను సైతం షాక్ కి గురిచేస్తుంది. పెద్దగా నవ్వుతూ మంచు మనోజ్ "సెగ్గడ్డ వచ్చింది. గోకండి" అంటూ మంచు మనోజ్ సెటైర్ వేశారు.
అసలైతే మంచు విష్ణు తన ఇంటికి వచ్చి తమ కుటుంబానికి కావాల్సిన వ్యక్తి అయిన సారధి పైన దాడి కి దిగాడు అని సోషల్ మీడియాలో వీడియో పెట్టి మరీ రచ్చ మొదలు పెట్టింది మనోజే. కానీ ఇప్పుడు మాత్రం దాని గురించి ప్రశ్న ఎదురవ్వగానే మీడియా కి రివర్స్ లో కౌంటర్ వేసి షాక్ ఇచ్చారు మనోజ్. మరోవైపు మంచు విష్ణు "హౌస్ ఆఫ్ మంచుస్" అని షో ప్రకటించారు. ఇక మంచు మోహన్ బాబు మాత్రం ప్రతి ఇంట్లోనూ ఇలాంటి గొడవలు కామన్ అని మీడియా చూపిస్తున్నంత దారుణం గా ఏమీ గొడవలు లేవని కొట్టి పారేశారు.