Manchu Family: మనోజ్ ఇంటి చుట్టూ బౌన్సర్స్.. తమ్ముడిని చూసేందుకు వచ్చిన మంచు లక్ష్మి
Manchu Family: మంచు ఫ్యామిలీలో చోటు చేసుకున్న వివాదాన్ని సర్ధిచెప్పేందుకు మంచు లక్ష్మి ప్రయత్నాలు ప్రారంభించారు.
Manchu Family: మనోజ్ ఇంటి చుట్టూ బౌన్సర్స్.. తమ్ముడిని చూసేందుకు వచ్చిన మంచు లక్ష్మి
Manchu Family: మంచు ఫ్యామిలీలో చోటు చేసుకున్న వివాదాన్ని సర్ధిచెప్పేందుకు మంచు లక్ష్మి ప్రయత్నాలు ప్రారంభించారు. ముంబై నుంచి ఆమె హైద్రాబాద్ కు సోమవారం ఉదయం వచ్చారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఆమె మంచు మనోజ్ ఇంటికి చేరుకున్నారు. మనోజ్ తో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఆమె తిరిగి వెళ్లిపోయారు. దుబాయ్ లో ఉన్న మనోజ్ సోదరుడు మంచు విష్ణు కూడా సోమవారం హైద్రాబాద్ తిరిగి వస్తున్నారు.
మనోజ్ ఇంటి బయట బౌన్సర్లను మోహరించారు. కొందరు విష్ణు తరపున, మరికొందరు మనోజ్ తరపున బౌన్సర్లు చేరుకున్నారు. ఆదివారం నాడు ఆస్తుల వివాదంపై మనోజ్ పై దాడి జరిగిందని వార్తలు వచ్చాయి. అయితే తమ కుటుంబంలో ఎలాంటి వివాదం లేదని మోహన్ బాబు టీమ్ ప్రకటించింది.
కానీ, మంచు మనోజ్ హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆదివారం వెళ్లి చికిత్స తీసుకున్నారు. ఆయన శరీరంపై గాయాలున్నాయని వైద్యులు గుర్తించారని సమాచారం.కొంతకాలంగా మంచి ఫ్యామిలీలో విబేధాలున్నాయని ప్రచారం సాగుతోంది. గతంలో మంచు విష్ణు, మనోజ్ మధ్య గొడవ జరిగిందని మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో మోహన్ బాబు కుటుంబంలో ఏదో జరుగుతోందనే ప్రచారానికి ఊతమిచ్చింది.
మంచు మనోజ్ ఆదివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కుటుంబంలో సమస్యలను తాము మాట్లాడుకుంటామని చెప్పడంతో పోలీసులు మనోజ్ ఇంటి నుంచి వెళ్లిపోయారని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఈ కథనాలు వచ్చిన గంటల వ్యవధిలోనే మనోజ్ ఆసుపత్రికి వెళ్లారు.