Crime Thriller In Ott: ఓటీటీకి రియల్ క్రైమ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ సినిమాలకు ఓటీటీల్లో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ జానర్‌కు విపరీతమైన క్రేజ్ ఉండటంతో, ఇప్పటికే తెలుగులో డబ్బింగ్ అయిన పలు మలయాళ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
Crime Thriller In Ott: ఓటీటీకి రియల్ క్రైమ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ సినిమాలకు ఓటీటీల్లో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ జానర్‌కు విపరీతమైన క్రేజ్ ఉండటంతో, ఇప్పటికే తెలుగులో డబ్బింగ్ అయిన పలు మలయాళ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అదే తరహాలో మరో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. సుదేవ్ నాయర్, జిన్స్, జియో బేబీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను, కేరళలోని త్రిస్సూర్‌లో జరిగిన అత్యంత వివాదాస్పద కేసు ఆధారంగా రూపొందించారు.
‘కమ్మటం’ పేరుతో తెరకెక్కిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ సిరీస్ ఒక అనుమానాస్పద రోడ్డు ప్రమాదం చుట్టూ తిరుగుతుంది. ఆ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందడం, ఆ కేసు వెనుక దాగి ఉన్న సంఘటనలతో మొత్తం కథ సాగుతుంది. మొత్తం ఆరు ఎపిసోడ్లతో రూపొందించిన ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 29 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రత్యేక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అజయ్ వాసుదేవ్, అఖిల్ కవలయూర్, అరుణ్ సోల్, శ్రీరేఖ, జోర్డీ పొంజా ముఖ్య పాత్రలు పోషించారు.