Mahesh Babu: ఇదేంటి భయ్యా.. మహేష్ బాబు ఇలా అయ్యాడు. కొత్త లుక్ చూస్తే పరేషాన్ అవ్వాల్సిందే
Mahesh Babu: మహేష్ లుక్‌కి సంబంధించి అధికారికంగా ఒక్క ప్రకటన కూడా రాలేదు. అయితే కొన్ని ఫొటోలు మాత్రం అడపాదడపా వైరల్ అవుతున్నాయి.
Mahesh Babu: ఇదేంటి భయ్యా.. మహేష్ బాబు ఇలా అయ్యాడు. కొత్త లుక్ చూస్తే పరేషాన్ అవ్వాల్సిందే
Mahesh Babu: అపజయం ఎరగని దర్శకుడు రాజమౌళి, కోట్లాది మంది అభిమానులున్న ప్రిన్స్ మహేష్ బాబు వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఉండనుందని ఇలా ప్రకటన వచ్చిందో లేదో అంచనాలు అలా పెరిగిపోయాయి. పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
సినిమాకు సంబంధించి ఏ ఒక్క చిన్న సమాచారం కూడా బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న మేకర్స్ షూటింగ్‌ను చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఒక్క విషయం కూడా బయటకు రాకుండా మేకర్స్ చూస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, ఒడిశాల్లో కీలక షెడ్యూల్స్ పూర్తి చేసిన చిత్రబృందం, త్వరలో ఓ కీలక భాగం కోసం విదేశాలకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
అయితే మహేష్ లుక్‌కి సంబంధించి అధికారికంగా ఒక్క ప్రకటన కూడా రాలేదు. అయితే కొన్ని ఫొటోలు మాత్రం అడపాదడపా వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కోసం మహేష్ తన మేకోవర్‌ను పూర్తిగా మార్చేశారు. గుబురు గడ్డంతో రగ్డ్ లుక్‌లో కనిపిస్తు్నారు. తాజాగా ఈ లుక్‌కు సంబంధించిన ఓ ఫొటో లీక్ అయ్యింది. నమ్రతాతో పాటు ఉన్న ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మునుపెన్నడూ లేని విధంగా మహేష్ సరికొత్త మాస్ లుక్‌లో కనిపిస్తుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే దాదాపు రూ.వెయ్యి కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందనుందని సమాచారం తొలి భాగాన్ని 2027లో గ్రాండ్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. గ్లోబల్ స్టాండర్డ్స్‌తో, హాలీవుడ్ రేంజ్‌లో ఈ చిత్రాన్ని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు.