Mahesh Babu - NTR: ఎన్టీఆర్ షో లో అలరించనున్న మహేష్ బాబు

Mahesh Babu - NTR: ఎన్టీఆర్ తో బుల్లితెరని పలకరించనున్న మహేష్ బాబు

Update: 2021-12-01 06:43 GMT

ఎవరు మీలో కోటీశ్వరులు షో లో అలరించనున్న మహేష్ బాబు (ఫైల్ ఇమేజ్)

Mahesh Babu - NTR: ఈమధ్యనే "ఆర్ ఆర్ ఆర్" చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు బుల్లితెర మీద కూడా సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. "ఎవరు మీలో కోటీశ్వరుడు" తో కూడా బిజీగా ఉన్న ఎన్ టీ ఆర్, ఈ ప్రోగ్రాం మొదట్లో కర్టెన్ రైజర్ ఎపిసోడ్ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా పిలిచారు. ఆ తర్వాత ఈ మధ్యనే దసరా సందర్భంగా సమంతా కూడా ఈ షోలో కనిపించారు. ఇప్పుడు ఎన్టీఆర్ షో లో కనిపించడానికి సిద్ధమవుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు.

ఈ షో ఆఖరి ఎపిసోడ్ కి ముఖ్య అతిథిగా మహేష్ బాబు ని సంప్రదించగా మహేష్ బాబు కూడా ఒప్పుకున్నారు. ఇక ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయింది. అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ఎపిసోడ్ డిసెంబర్ 4 న రాత్రి 8.30 నుండి 10 వరకు ప్రసారం కాబోతుంది. మరోవైపు ఈ షో సెకండ్ సీజన్ కోసం కూడా ఎన్టీఆర్ ఒప్పుకోలేదని, కొన్నాళ్లు తారక్ సినిమాల మీద ఫోకస్ చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. మరోవైపు మహేష్ బాబు "సర్కారు వారి పాట" సినిమాతో బిజీగా ఉన్నారు.

Tags:    

Similar News