Madhavan: సగం మంది హీరోలు అదే కోరుకుంటారు… ప్రియాంకపై మాధవన్ ప్రశంసలు!

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన మాధవన్ (Madhavan), ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం “ఆప్ జైసా కోయి” (Aap Jaisa Koi) నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.

Update: 2025-07-17 16:15 GMT

Madhavan: సగం మంది హీరోలు అదే కోరుకుంటారు… ప్రియాంకపై మాధవన్ ప్రశంసలు!

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన మాధవన్ (Madhavan), ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం “ఆప్ జైసా కోయి” (Aap Jaisa Koi) నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఫాతిమా సనా షేక్ (Fathima Sana Shaik) ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాధవన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటూ, నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

హాలీవుడ్‌లో సత్తా చాటుతున్న ప్రియాంక

బాలీవుడ్‌లో అగ్రతారగా ఎదిగిన ప్రియాంక చోప్రా, హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకుని, హాలీవుడ్ సినిమాలలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. హాలీవుడ్‌లో స్థిరపడిన తర్వాత బాలీవుడ్ ప్రాజెక్టులను తగ్గించిన ప్రియాంక, వరుసగా హాలీవుడ్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో నటిస్తూ దూసుకెళ్తున్నారు.

హెడ్స్ ఆఫ్ స్టేట్‌పై మాధవన్ కామెంట్స్

ప్రియాంక చోప్రా నటించిన “హెడ్స్ ఆఫ్ స్టేట్ (Heads Of State)” సినిమా గురించి మాట్లాడిన మాధవన్,

“ప్రియాంక హాలీవుడ్‌లో ఇంత పెద్ద సినిమాలో ప్రధాన పాత్రను సునాయాసంగా పోషించడం గొప్ప విషయం. యాక్షన్ సన్నివేశాల్లో ఆమె అద్భుతంగా నటించింది. ఇండియాలో సగం మంది హీరోలు ఇలాంటి హాలీవుడ్ స్థాయి సినిమాలలో నటించాలని కోరుకుంటారు” అంటూ ప్రశంసించారు.

రాజమౌళి సినిమాలో ప్రియాంక

ప్రస్తుతం ప్రియాంక చోప్రా రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న SSMB 29 అడ్వెంచర్ మూవీకి సైన్ చేశారు. పాన్‌-వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంలో హాలీవుడ్‌లో గుర్తింపు పొందిన ప్రియాంకను చేర్చినట్లు సమాచారం. మహేష్ అభిమానులు ఈ ప్రాజెక్ట్‌పై ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News