Lokesh Kanagaraj : మరో నాలుగైదేళ్లు లోకేష్ కనగరాజ్ ఫుల్ బిజీ.. లైన్‌లో భారీ ప్రాజెక్టులు
Lokesh Kanagaraj : సౌతిండియాలో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. స్టార్ హీరోలకు ఉన్నట్టే ఆయన అంటే పడి చచ్చిపోయే అభిమానులు ఉన్నారు.
Lokesh Kanagaraj : మరో నాలుగైదేళ్లు లోకేష్ కనగరాజ్ ఫుల్ బిజీ.. లైన్‌లో భారీ ప్రాజెక్టులు
Lokesh Kanagaraj : సౌతిండియాలో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. స్టార్ హీరోలకు ఉన్నట్టే ఆయన అంటే పడి చచ్చిపోయే అభిమానులు ఉన్నారు. యాక్షన్, ఇంటెన్స్ సినిమాలను తెరకెక్కించడంలో ఆయన దిట్ట. ఇప్పటికే ఖైదీ , విక్రమ్ , మాస్టర్ , లియో వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌లను అందించారు. ఆయన సృష్టించిన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో సినిమాలు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన కూలి సినిమా విడుదల కాబోతుండగా, నెక్ట్స్ ఏ సినిమా చేయబోతున్నారు అనే విషయంపై ఆసక్తి మొదలైంది. దీనిపై లోకేష్ ఆన్సర్ ఇచ్చారు.
తాజా ఇంటర్వ్యూలో లోకేష్ కనగరాజ్ తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి వెల్లడించారు. ప్రస్తుతం ఆయన చేతిలో చాలా సినిమాలు ఉన్నాయని చెప్పారు. ముందుగా తన ఎల్‌సీయూ సినిమాలను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ముందుగా ఖైదీ 2 సినిమాను మొదలుపెట్టనున్నట్లు ప్రకటించారు. నిజానికి, ఖైదీ విడుదలైన రెండు సంవత్సరాలకే ఖైదీ 2 చేయాలనుకున్నారట. కానీ, ఇప్పుడు ఆరేళ్ల తర్వాత ఆ సినిమాను చేయనున్నారు. ఖైదీ 2 తర్వాత కమల్ హాసన్ నటించిన విక్రమ్ 2 సినిమాను కూడా పూర్తి చేస్తారని చెప్పారు.
ఇవే కాకుండా, విక్రమ్ సినిమాలో సూర్య నటించిన రోలెక్స్ పాత్రను ప్రధానంగా తీసుకుని ఒక పూర్తిస్థాయి సినిమా చేయాలనే ఆలోచన కూడా లోకేష్‌కు ఉంది. అలాగే, బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తో ఒక సినిమా చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఆమిర్ ఖాన్ కోసం ఒక భారీ యాక్షన్ సినిమాను లోకేష్ తెరకెక్కించనున్నారు. లోకేష్ తన మొదటి సినిమా మానగరం సినిమాకు కూడా సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఇవన్నీ చూస్తే, లోకేష్ కనగరాజ్ రానున్న నాలుగైదు సంవత్సరాలు చాలా బిజీగా ఉండనున్నారు.