Laila Movie Review: లైలా మెప్పించాడా.? విశ్వక్ ఖాతాలో హిట్ పడిందా.?
Laila Movie Review: విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన చిత్రం లైలా. విడుదలకు ముందే ఈ సినిమా వార్తల్లో నిలిచింది.
Laila Movie Review: లైలా మెప్పించాడా.? విశ్వక్ ఖాతాలో హిట్ పడిందా.?
Laila Movie Review: విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన చిత్రం లైలా. విడుదలకు ముందే ఈ సినిమా వార్తల్లో నిలిచింది. ఓవైపు సినిమా ట్రైలర్‌తో అంచనాలు పెరగగా. చిత్ర యూనిట్ సైతం గట్టిగానే ప్రమోషన్స్‌ను చేపట్టింది. ఇదిలా ఉంటే లైలా మూవీ కాంట్రవర్సీలతోనూ వార్తల్లో నిలిచింది. మరి భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంది.? విశ్వక్ సేన్ ఖాతాలో ఇప్పటికైనా ఓ విజయం పడిందా.? రివ్యూలో చూద్దాం.
కథేంటి.?
సోను మోడల్ (విశ్వక్ సేన్) హైదరాబాద్ ఓల్డ్ సిటీలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తాడు. ఆ ప్రాంతంలోని మహిళల్లో అతనికి మంచి గౌరవం ఉంటుంది. కేవలం అందంగా మేకోవర్ చేయడమే కాకుండా, అవసరమైనప్పుడు వారికి సహాయం కూడా చేస్తాడు. ఒకసారి ఓ కస్టమర్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే, సోను ఆమె భర్త చేస్తున్న ఆయిల్ బిజినెస్‌కు తన ఫోటో వాడుకోవాలని సూచిస్తాడు. అయితే, స్థానిక పురుషులు, ముఖ్యంగా ఎస్సై శంకర్ (పృథ్వీ)కు, అలాగే మేకల వ్యాపారి రుస్తుం (అభిమన్యు సింగ్)కు సోను అంటే అసహ్యం. ఓ అనుకోని ఘటనలో, సోను చేయని నేరంలో ఇరుక్కుంటాడు. పోలీసులు, రుస్తుం గుంపు అతని వెంట పడతారు. దీంతో తప్పించుకునేందుకు గెటప్ మార్చి లైలాగా మారతాడు. కానీ, అసలు సోనుపై ఆరోపణలు ఎందుకు వచ్చాయి? నిజానికి అతన్ని ఫ్రేమ్ చేసినవారు ఎవరు? రుస్తుం ఎందుకు కక్ష పెంచుకున్నాడు? లైలాగా మారిన తర్వాత అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? జెన్నీ (ఆకాంక్ష శర్మ)తో ప్రేమాయణం ఏ మలుపులు తిరిగింది? చివరికి తనను మోసం చేసినవాళ్లకు లైలా ఎలా సమాధానం చెప్పాడు? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!
ఎలా ఉందంటే..
విశ్వక్ సేన్ తన నటనతో యూత్‌ను ఆకట్టుకుంటాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కథలో కొత్తదనం లేనప్పుడు ఏం చేయాలేం అన్నట్లు పరిస్థితింది. లైలా కథనం కూడా అలాగే ఉంటుంది. కొన్ని సన్నివేశాలు రొటీన్‌గా అనిపిస్తాయి. ఏదో పాత సినిమా చూసిన భావన కలుగుతుంది. సినిమాలో కొత్తదనం కనిపించదు. అయితే సినిమా అంతా బాగాలేదా అంటే అలా కూడా చెప్పలేం. విశ్వక్సేన్ లైలా పాత్రకు 100 శాతం న్యాయం చేశారు. నటుడిగా విశ్వక్ సేన్ సినిమాను ఒంటి చేత్తో నడిపించాడు. ఇక హీరోయిన్‌కు సినిమాలో పెద్ద ప్రాధాన్యత లేదనే చెప్పాలి. కామేడీ సీన్స్ బాగున్నాయి. అయితే కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ కాస్త ఇబ్బందిగా ఉన్నాయి. రుస్తుం పాత్రలో అభిమన్యుసింగ్ నటన బాగుంది. ఇక సునిశిత్ కూడా ఇందులో నటించాడు. కామాక్షి భాస్కర్ల డీ గ్లామర్ రోల్ మెప్పించింది.