OTT: ప్రతీ క్షణం నరాలు తెగే ఉత్కంఠ.. ఓటీటీలో అదిరిపోయే క్రైమ్ మూవీ
ఇటీవలి కాలంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై సస్పెన్స్, క్రైమ్, హారర్ థ్రిల్లర్‌లకు విపరీతమైన ఆదరణ కనిపిస్తోంది
OTT: ప్రతీ క్షణం నరాలు తెగే ఉత్కంఠ.. ఓటీటీలో అదిరిపోయే క్రైమ్ మూవీ
OTT: ఇటీవలి కాలంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై సస్పెన్స్, క్రైమ్, హారర్ థ్రిల్లర్‌లకు విపరీతమైన ఆదరణ కనిపిస్తోంది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, ఈ జానర్ సినిమాలు డిజిటల్ వేదికలపై మాత్రం హవా కొనసాగిస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.
ఈ జాబితాలోకే వస్తుంది తాజాగా విడుదలైన ‘లెవెన్’ అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో దేశవ్యాప్తంగా ట్రెండింగ్ నెంబర్ వన్ మూవీగా నిలిచింది. ‘లెవెన్’ అనే ఈ థ్రిల్లర్ మూవీ 2025 జూన్ 13న అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
అప్పటి నుంచి ఈ సినిమాకి విపరీతమైన స్పందన వస్తోంది. IMDbలో ఈ సినిమాకు 7.5/10 రేటింగ్ ఉండడం విశేషం. సుమారు 2 గంటల 16 నిమిషాల నిడివితో వచ్చిన ఈ సినిమా, థియేటర్లలో ఇప్పటికే మంచి స్పందన అందుకున్నప్పటికీ, ఇప్పుడు ఓటీటీలో మరింత ఆదరణను సొంతం చేసుకుంది.
కథేంటంటే..?
కథ విశాఖపట్నం నేపథ్యంలో సాగుతుంది. అక్కడ వరుస హత్యలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ప్రతి హత్య ఒకే రకమైన మోడస్ ఓపరండీతో జరగడంతో ఇది సీరియల్ కిల్లర్ పని అని స్పష్టమవుతుంది. ఈ కేసును విచారించేందుకు పోలీస్ శాఖ ఒక తెలివైన పోలీస్ ఆఫీసర్‌ను నియమిస్తుంది. అయినప్పటికీ హత్యలు ఆగవు.
ఒక కేసులో శవం వద్ద లభించిన ఆధారాల ఆధారంగా పోలీస్ ఆఫీసర్ కీలకమైన పాయింట్ గుర్తిస్తాడు – హత్యకు గురవుతున్నవారు కవలలు. కానీ, ఈ కవలల్లో ఒకరినే లక్ష్యంగా చేసుకుంటున్నాడు సీరియల్ కిల్లర్. ఎందుకు కేవలం ఒక కవలనే చంపుతున్నాడు? ఈ కవలలతో కిల్లర్‌కు ఏమైనా వ్యక్తిగత సంబంధమా? చివరకు పోలీసులు ఈ మిస్టీరియస్ కిల్లర్‌ను పట్టుకున్నారు? లేదా? అనేదే మిగతా కథ.
నటీనటుల పెర్ఫార్మెన్స్
ఈ సినిమాకు దర్శకత్వం వహించిన లోకేశ్ అజిల్స్, కథను ఎంతో గ్రిప్పింగ్‌గా నడిపించారు. హీరోగా నవీన్ చంద్ర తన నటనతో ఆకట్టుకున్నాడు. రియా హరి, శశాంక్, అభిరామి లాంటి నటులు కూడా తమ పాత్రల్లో మెప్పించారు. క్లైమాక్స్‌లో వచ్చే మేజర్ ట్విస్ట్ ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తుంది.