Legally Veer: రియల్ కోర్టు రూమ్ డ్రామా 'లీగల్లీ వీర్'
Legally Veer: వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘లీగల్లీ వీర్’. రవి గోగుల దర్శకత్వంలో శాంతమ్మ మలికిరెడ్డి నిర్మిస్తున్నారు.
Legally Veer: రియల్ కోర్టు రూమ్ డ్రామా 'లీగల్లీ వీర్'
Legally Veer: వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘లీగల్లీ వీర్’. రవి గోగుల దర్శకత్వంలో శాంతమ్మ మలికిరెడ్డి నిర్మిస్తున్నారు. సోమవారం ఈ మూవీ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా హీరో వీర్ రెడ్డి మాట్లాడుతూ ‘ఇంతవరకు మన దగ్గర సరైన లీగల్ థ్రిల్లర్ సినిమాలు రాలేదు. నేను స్వతహాగా లీగల్ లాయర్‌ను కాబట్టి.. రియల్ కోర్టు డ్రామా ఎలా ఉంటుందో చూపించాలనుకున్నా. డిసెంబర్ 27న సినిమా రిలీజ్ చేస్తున్నాం’ అని చెప్పాడు. ఈ గ్లింప్స్ అందరికీ నచ్చిందని చెప్పడం హ్యాపీ అని దర్శకుడు రవి అన్నాడు. నటుడు గిరిధర్, కొరియోగ్రాఫర్ వల్లం కళాధర్ పాల్గొన్నారు.
డైరెక్టర్ రవి మాట్లాడుతూ.. ‘వీర్ గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని అనిపిస్తుంది. గ్లింప్స్ చూశాకా నాకు మాటలు రావడం లేదు. మా సినిమాకి మీడియా ప్రోత్సహించి, ఆదరించాలి’ అని అన్నారు. నటుడు గిరిధర్ మాట్లాడుతూ ‘కొత్త టీం అయినా కూడా సినిమాని చాలా బాగా అద్భుతంగా చిత్రీకరించారు. నేను ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అవుతోంది కానీ ఇలాంటి టీం ఇంత వరకు చూడలేదు’ అని అన్నారు.