Pushpa 2: పుష్ప2 సినిమాలో ఫీలింగ్స్ పాట పాడిన లక్ష్మీదాస.. బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

Pushpa 2: పుష్ప 2 సినిమాలో ఫీలింగ్స్ పాటను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన లక్ష్మీ దాస అనే యువతి పాడారు.

Update: 2024-12-05 07:45 GMT

Pushpa 2: పుష్ప2 సినిమాలో ఫీలింగ్స్ పాట పాడిన లక్ష్మీదాస.. బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

Pushpa 2: పుష్ప 2 సినిమాలో ఫీలింగ్స్ పాటను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన లక్ష్మీ దాస అనే యువతి పాడారు. చంద్రబోస్ రాసిన ఈ పాటను శంకర్ బాబుతో కలిసి ఆమె పాడారు. నిన్నాడేమన్నంటినా తిరుపతి అనే పాటతో ఆమె బాగా పాపులర్ అయ్యారు. పుష్ప సినిమాలో సామీ సామీ పాటను ఫోక్ సింగర్ లక్ష్మి పాడారు. ఈ పాట సూపర్ డూపర్ హిట్టయింది.

ఎవరీ లక్ష్మీదాస

నిర్మల్ జిల్లా ముథోల్ మండలం గన్నోర గ్రామానికి చెందిన దాస లక్ష్మణ్, దాస జయశ్రీల కూతురే లక్ష్మీ. చిన్నప్పటి నుంచి జానపద పాటలు పాడేది. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో టీవీలో వచ్చే పాటలకు అనుగుణంగా పాటలు పాడుతూ డ్యాన్స్ చేసేది. అలా ఆమె జానపద పాటలు పాడేందుకు దోహదపడింది. లక్ష్మీలోని టాలెంట్ ను ఆష్టా దిగంబర్, గడ్డం రమేశ్ లు గుర్తించి ప్రోత్సహించారు. ఇలా ఆమె వందలాది జానపద గీతాలు పాడారు. ఇలా ఆమెలోని టాలెంట్ ను గుర్తించిన సంగీత దర్శకులు రఘు కుంచె ఆమెకు తొలిసారి సినిమాలో పాడే అవకాశం కల్పించారు. బ్యాచ్ సినిమాలో ఆమె తొలి పాట పాడారు. ఆ తర్వాత నాని నటించిన దసరా సినిమాలో ధూమ్ ధాం చేసుకుందాం పాట పాడారు.

Full View


Tags:    

Similar News