Shalini Vadnikatti Weds Manoj Beedha : పెళ్ళి పీటలెక్కిన 'కృష్ణ అండ్ హిజ్ లీలా' హీరోయిన్!
Shalini Vadnikatti Weds Manoj Beedha : కరోనా సమయంలో ధియేటర్లు లేకా సినిమాలు అన్ని ఓటీటీలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.. అందులో భాగంగానే
Krishna and his Leela actress Shalini Vadnikatti weds Manoj Beedha
Shalini Vadnikatti Weds Manoj Beedha : కరోనా సమయంలో ధియేటర్లు లేకా సినిమాలు అన్ని ఓటీటీలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.. అందులో భాగంగానే ఓటీటీలో విడుదలైన మంచి హిట్ కొట్టింది కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమా.. ఈ సినిమాలో రాధ అనే పాత్రలో నటించి మెప్పించింది కన్నడ నటి షాలిని వడ్నికట్టి.. ట్రెడిషనల్ గా కనిపిస్తూనే గ్లామర్‌తోనూ ఆకట్టుకుంది. ఈ ఒక్క సినిమాతో చాలా మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ బ్యూటి.. అయితే తాజాగా సైలెంట్ గా పెళ్లి చేసుకొని అందరికి పెద్ద షాక్ ఇచ్చింది ఈ అమ్ముడు..
తమిళ దర్శకుడు మనోజ్ బీదను ఆమె వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కరోనా వలన కేవలం కొద్ది మంది బంధువుల సమక్షంలో వీరి వివాహం జరిగినట్టుగా సమాచారం.. ఇక ప్లస్ అనే కన్నడ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన షాలిని.. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. నటిగా మంచి పాపులర్ అవుతున్న టైంలో ఇలా సడన్ గా పెళ్లి చేసుకోవడం అందరికి షాక్ ని ఇచ్చింది..
ఇక కరోనా లాంటి సంక్షోభంలో సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.. ఇప్పటికే నిఖిల్, నితిన్, రానా లాంటి యుంగ్ హీరోలు పెళ్లి చేసుకొని ఓ ఇంటివాళ్ళు అయ్యారు.
#SPP Team's Hearty Congratulations to Vanjagar Ulagam Director #ManojBeeda and Actress #ShaliniVadnikatti who got hitched today.#happywedding @spp_media pic.twitter.com/ikYwpvi3NF
— Priya - PRO (@PRO_Priya) August 21, 2020