Kingdom: అన్నదమ్ములుగా విజయ్, సత్యదేవ్.. సాంగ్ ప్రోమో విడుదల

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్‌డమ్ సినిమా నుంచి వరుస అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం జూలై 31న థియేటర్లలో విడుదల కానుంది.

Update: 2025-07-15 16:19 GMT
Kingdom: అన్నదమ్ములుగా విజయ్, సత్యదేవ్.. సాంగ్ ప్రోమో విడుదల

Kingdom: అన్నదమ్ములుగా విజయ్, సత్యదేవ్.. సాంగ్ ప్రోమో విడుదల

  • whatsapp icon

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్‌డమ్ సినిమా నుంచి వరుస అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం జూలై 31న థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా చిత్రబృందం తాజాగా "అన్న అంటూనే" అనే సాంగ్ ప్రోమోను విడుదల చేసింది. ఇందులో విజయ్, సత్యదేవ్‌ల మధ్య ఉన్న అన్నదమ్ముల అనుబంధాన్ని హైలెట్ చేశారు.

“మర్చిపోవడానికి వాడేమన్నా గోడమీద ఉన్న దేవుడా.. నా గుండెల్లో ఉన్న నా అన్న” అంటూ విజయ్ చెప్పిన డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రోమోలో తమ్ముడి కోసం అన్న పడిన కష్టాలు, చిన్నతనంలో వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఎమోషనల్‌గా చూపించారు.

సినిమాలో ఈ అన్నదమ్ముల సెంటిమెంట్ హైలెట్ అయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. హీరో పాత్రకు ఎమోషనల్ సెంటిమెంట్ ఉంటే అది సినిమా ఇమేజ్‌ను పెంచుతుందనేది తెలిసిందే. కింగ్‌డమ్‌లో కూడా ఇదే ఫార్ములాను ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. గౌతమ్ తిన్నమూరి తన ప్రత్యేకమైన ఎమోషనల్ సీన్లతో ప్రేక్షకులను కట్టిపడేయడానికి సిద్ధంగా ఉన్నారు. పూర్తి సాంగ్ రేపు విడుదల కానుంది.


Full View


Tags:    

Similar News