Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. కింగ్డమ్ సీక్వెల్ రాబోతోందా?

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వచ్చిన కింగ్డమ్ సినిమా భారీ విజయం సాధించింది.

Update: 2025-08-05 06:30 GMT

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. కింగ్డమ్ సీక్వెల్ రాబోతోందా?

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వచ్చిన కింగ్డమ్ సినిమా భారీ విజయం సాధించింది. జూలై 31న విడుదలైన ఈ సినిమా తొలిరోజునే ప్రపంచవ్యాప్తంగా రూ.33 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఫ్యాన్స్‌కు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఒక గుడ్ న్యూస్ చెప్పారు. కింగ్డమ్ సినిమాకు సీక్వెల్ గా కింగ్డమ్ 2 రాబోతోందని, అంతేకాకుండా ఈ కథకు సంబంధించి ఒక స్పిన్-ఆఫ్ కూడా చేయాలని ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా భవిష్యత్తులో కింగ్డమ్ 3 కూడా రావచ్చని ఆయన పరోక్షంగా సూచించారు.

కింగ్డమ్ సినిమా చివరిలో సేతు అనే విలన్ పాత్రను పరిచయం చేశారు. ఈ సేతు, మెయిన్ విలన్ సోదరుడు. కింగ్డమ్ 2 కథ ఈ హీరో, సేతు మధ్య జరిగే పోరాటం చుట్టూ తిరుగుతుంది. అయితే, ఈ సీక్వెల్ మొదలుపెట్టే ముందు సేతు పాత్రను కేంద్రంగా చేసుకుని ఓటీటీ కోసం ఒక ప్రత్యేక సినిమా తీయాలని గౌతమ్ తిన్ననూరి ప్లాన్ చేస్తున్నారు. మొదటి పార్ట్‌లో సమయం లేకపోవడం వల్ల కొన్ని సన్నివేశాలు తొలగించాల్సి వచ్చింది. ఈ ఓటీటీ సినిమా ఆ ఖాళీని పూరిస్తుంది. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ కూడా ధృవీకరించారు. అయితే, సేతు పాత్రను ఎవరు పోషిస్తారనే విషయం ఇంకా వెల్లడి కాలేదు.

దర్శకుడి ఆలోచనల ప్రకారం... కింగ్డమ్ కథను మొత్తం మూడు భాగాలుగా తీసే అవకాశం ఉంది. ఈ కథ ఎక్కడి నుంచి మొదలయ్యింది. కింగ్డమ్ ఎలా పుట్టింది వంటి విషయాలను ఈ మూడు పార్టులలో చూపించవచ్చు. అయితే, దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం కింగ్డమ్ 2, ఓటీటీ స్పిన్-ఆఫ్ గురించే చర్చలు జరుగుతున్నాయి. ఈ అప్‌డేట్‌తో విజయ్ దేవరకొండ అభిమానులు, సినిమా ప్రేమికులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Tags:    

Similar News