కియారా అద్వానీ బికినీ గ్లామర్‌తో హీట్ పెంచిన 'వార్ 2' ఆవన్ జవాన్ సాంగ్ | Jr NTR, Hrithik Roshanతో స్క్రీన్ షేర్
War 2 Avan Jawan song: కియారా అద్వానీ బికినీ గ్లామర్, జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌తో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2'లో వేడి పుట్టిస్తోంది. అవన్ జవాన్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్.
Kiara Advani Raises Heat with Bikini Glam in ‘War 2’ Aawan Jawan Song | Shares Screen with Jr NTR & Hrithik Roshan
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒకే ఒక్క పేరు మారుమోగుతోంది... అది కియారా అద్వానీ. తాజాగా విడుదలైన 'వార్ 2' మూవీ నుంచి 'ఆవన్ జవాన్' పాటలో కియారా అద్వానీ బికినీ లుక్‌తో అభిమానులను మైమరిపించింది. జూలై 31న తన పుట్టినరోజు సందర్భంగా ఈ గ్లామర్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ పాటలో కియారా అద్వానీ ఎక్స్‌పోజింగ్ చేసిన విధానం, హృతిక్ రోషన్‌తో రొమాంటిక్ కెమిస్ట్రీ, యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కేవలం సెకన్ల పాటు కనిపించినా ఆమె బికినీ గ్లామర్, స్టైల్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఆమె లుక్స్ చూసిన నెటిజన్స్... దీపికా పదుకొణెను తలపించిందని కామెంట్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
'వార్ 2'లో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటికే టీజర్‌తో హైప్ క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ విలన్‌గా నటించనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ల వ్యూస్‌ను సాధించి యూట్యూబ్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. కియారా అద్వానీ బికినీ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది.
గమనించదగిన విషయం ఏమిటంటే, కియారా తాజాగా ఓ పాపకి జన్మనిచ్చిన తర్వాత బికినీలో ఇలా హాట్‌గా కనిపించడం ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌గా మారింది. తల్లి అయినా గ్లామర్‌లో తగ్గేదే లేదని మరోసారి ప్రూవ్ చేసింది.
తెలుగులో ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’, ‘గేమ్ చేంజర్’ వంటి చిత్రాల్లో నటించిన కియారా, జూనియర్ ఎన్టీఆర్‌తో తొలిసారి స్క్రీన్ షేర్ చేస్తోంది. ఈ జోడీ ఎలా పనిచేస్తుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.