KGF: కేజీఎఫ్‌ నటుడు కన్నుమూత

KGF: ప్రముఖ నటుడు, 'కేజీఎఫ్' (KGF) చిత్రంలో ఖాసిం చాచా పాత్ర పోషించిన హరీశ్ రాయ్ (Harish Rai) కన్నుమూశారు.

Update: 2025-11-06 07:24 GMT

KGF: కేజీఎఫ్‌ నటుడు కన్నుమూత

KGF: ప్రముఖ నటుడు, 'కేజీఎఫ్' (KGF) చిత్రంలో ఖాసిం చాచా పాత్ర పోషించిన హరీశ్ రాయ్ (Harish Rai) కన్నుమూశారు. గత కొంతకాలంగా థైరాయిడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో సినీరంగంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

1990ల మధ్య నుంచి సినిమా రంగంలో కొనసాగిన హరీశ్ రాయ్, విలక్షణ నటనతో ప్రేక్షకుల గుర్తింపు పొందారు. 'ఓం' (1995): ఈ చిత్రంలో డాన్ రాయ్ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. 'కేజీఎఫ్' సిరీస్ ఇందులో ఆయన పోషించిన ఖాసిం చాచా పాత్ర ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది.

మూడేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో హరీశ్ రాయ్ తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. క్యాన్సర్ కారణంగా తన గొంతు భాగం వాచిపోయిందని, అది బయటకు కనిపించకుండా ఉండేందుకే 'కేజీఎఫ్' సినిమాలో పొడవాటి గడ్డం పెంచానని ఆ సందర్భంగా వెల్లడించారు.

ఆయన ఆర్థిక సాయం కోరగా, పలువురు సినీ ప్రముఖులు స్పందించి ఆదుకున్నారు. అయితే, విధి నిర్ణయాన్ని ఎవరూ తప్పించుకోలేరంటూ నేడు ఆయన తుదిశ్వాస విడిచారు. రీశ్ రాయ్ మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు.

Tags:    

Similar News