Keerthy Suresh: కాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కీర్తి సురేష్
Keerthy Suresh: "అదే జరిగితే సినిమా లు మానేస్తాను," అంటున్న కీర్తి సురేష్
Keerthy Suresh: కాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కీర్తి సురేష్
Keerthy Suresh: లెజెండరీ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన "మహానటి" సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన కీర్తి సురేష్ ఆ సినిమాతో తన కరియర్ లోనే మొట్టమొదటి బ్లాక్ బస్టర్ అందుకుంది. అయితే చిన్న హీరోయిన్ల నుంచి స్టార్ హీరోయిన్ల దాకా దాదాపు అందరూ హీరోయిన్లు కరియర్ లో ఏదో ఒక సమయంలో క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొని ఉంటారు. కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పటిదాకా తను ఎప్పుడు క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కోలేదు అని చెప్పుకొచ్చింది కీర్తి సురేష్. "ఇప్పటిదాకా నన్ను ఎవరు కమిట్మెంట్ అడగలేదు" అని జవాబు ఇచ్చింది కీర్తి సురేష్.
అంతేకాకుండా క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ కొన్ని షాకింగ్ కామెంట్లు చేసింది ఈ భామ. "మన ప్రవర్తన ను బట్టే అవతలి వారి ప్రవర్తన కూడా ఉంటుంది. అమ్మాయిలు కాస్త ఆ విధంగా కనిపించినా కూడా అవతలి వాళ్ళు క్యాస్టింగ్ కౌచ్ కి పాల్పడే అవకాశం ఉంది, కమిట్మెంట్ అడిగే ఛాన్స్ కూడా ఉంది," అని తన అభిప్రాయాన్ని చెప్పింది కీర్తి సురేష్. "ఒకవేళ నన్ను అలా ఎవరైనా అడిగి ఉంటే, అలాంటి పరిస్థితి నాకు వస్తే సినిమాలు వదిలేసి ఏదైనా జాబ్ చూసుకుంటాను. కానీ నన్ను ఇప్పటివరకు ఎవరు కమిట్మెంట్ అడగలేదు. నేను ఆ టైప్ కాదని అందరికీ తెలుసు.
అందుకే ఎవరు నాతో అలా ప్రవర్తించే సాహసం చేయరు," అని జవాబు ఇచ్చింది కీర్తి సురేష్. అయితే కీర్తి సురేష్ చేసిన వ్యాఖ్యలతో కొందరు అభిమానులు కూడా ఏకీభవించడం లేదు. కీర్తి సురేష్ చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తే అమ్మాయిల వల్లే క్యాస్టింగ్ కౌచ్ జరుగుతుంది అన్నట్టు ఉందని, తమ వైపు నుంచి ఎటువంటి తప్పు లేకుండానే కొందరు క్యాస్టింగ్ కౌచ్ బారిన పడుతున్నారని మరికొందరు చెబుతున్నారు. మరి ఈ విషయంలో కీర్తి సురేష్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.