Katrina Kaif: బాలీవుడ్‌లో పేరెంట్స్ కాబోతున్న మరో జంట..?

బాలీవుడ్ స్టార్ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కత్రినా ధరించిన మేటర్నిటీ డ్రెస్, క్రిటిక్ ఉమైర్ సంధు వ్యాఖ్యలతో గాసిప్స్‌కు మరింత ఊతం లభించింది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Update: 2025-08-03 04:20 GMT

Katrina Kaif: బాలీవుడ్‌లో పేరెంట్స్ కాబోతున్న మరో జంట..?

ఇప్పటి సినీ రంగంలో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు హీరోలు, హీరోయిన్లు తమ కెరీర్‌కి మొదటి ప్రాధాన్యత ఇస్తూ పెళ్లికి దూరంగా ఉండేవారు. పెళ్లి చేసుకుంటే అవకాశాలు తగ్గిపోతాయనే అభిప్రాయం ఎక్కువగా ఉండేది, ముఖ్యంగా నటీమణుల విషయంలో. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు స్టార్ హీరోయిన్లు తమ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పటికీ మ్యారేజ్ లైఫ్‌ను ఎంచుకుంటున్నారు. అంతేకాకుండా త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నామని సంతోషంగా ప్రకటిస్తున్నారు.

ఇప్పటికే కియారా అద్వాని – సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులకు పాప పుట్టింది. వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి కూడా తల్లిదండ్రులు కాబోతున్నట్టు వెల్లడించారు. తాజాగా బాలీవుడ్‌లోని మరో క్రేజీ జంట విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్ కూడా పేరెంట్స్ కాబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఒక సినిమాలో కూడా కలిసి నటించకుండానే ప్రేమలో పడ్డ ఈ జంట 2021 డిసెంబర్‌లో రాజస్థాన్‌లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి వీరి శుభవార్త కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఇటీవల వీరిద్దరూ ముంబై నుంచి అలీబాగ్‌కి వెళ్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో కత్రినా ధరించిన తెల్లటి మేటర్నిటీ షర్ట్‌ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇది గర్భిణులు ఎక్కువగా ధరిస్తారనే కామెంట్లతో అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు చేసిన పోస్ట్. కత్రినా ఇప్పటికే రెండో నెల ప్రెగ్నెన్సీలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కానీ విక్కీ కౌశల్ లేదా కత్రినా కైఫ్ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఇది నిజమేనా లేక రూమరా అనేది అధికారిక క్లారిటీ వచ్చే వరకూ వేచి చూడాల్సిందే. కానీ ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికే శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు!

Tags:    

Similar News