Kathi Mahesh: నేడు కత్తి మహేష్ అంత్యక్రియలు
Kathi Mahesh: నేడు కత్తి మహేష్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం అయిన చిత్తూరు జిల్లా యలమందలో జరగనున్నాయి.
Kathi Mahesh
Kathi Mahesh: కత్తి మహేష్ అంత్యక్రియలు నేడు ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా యర్రావారిపాలెం మండలంలోని యలమందలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన బంధువులు తెలిపారు. ఆయనకు భార్య సోనాలితో పాటు ఓ కుమారుడు ఉన్నారు. జూన్ 27న ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ తల, కళ్లకు తీవ్రగాయాలు కావడంతో ఆపరేషన్ నిర్వహించారు. అప్పటి నుంచి వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతున్న ఆయన శనివారం పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు.2014లో 'మిణుగురులు' చిత్రానికి సహ రచయితగా వ్యవహరించారు. 'పెసరట్టు' చిత్రంతో దర్శకుడిగా మారారు. 'హృదయ కాలేయం', 'కొబ్బరిమట్ట', 'క్రాక్' తదితర సినిమాల్లో నటించారు. మా టీవీ నిర్వహించే 'బిగ్‌బాస్' రియాలిటీ షోలోనూ పాల్గొని అలరించారు. ఆయన మరణం పట్ల తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.