100 కోట్ల మార్క్ ని దాటడానికి రెడీ అవుతున్న "కార్తికేయ 2"

Karthikeya 2: 100 కోట్ల క్లబ్ లో చేరనున్న నిఖిల్ సినిమా

Update: 2022-08-25 05:59 GMT

100 కోట్ల మార్క్ ని దాటడానికి రెడీ అవుతున్న "కార్తికేయ 2"

Karthikeya 2: "అర్జున్ సురవరం" సినిమాతో పెద్దగా మెప్పించలేకపోయిన యువ హీరో నిఖిల్ సిద్ధార్ధ్ కరోనా తర్వాత మొట్టమొదటిసారిగా "కార్తికేయ 2" సినిమాతో ఈ మధ్యనే వెండితెరపై కనిపించారు. 2014లో విడుదలై బ్లాక్ బస్టర్ గా మారిన "కార్తికేయ" సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ద్వారకా మరియు శ్రీకృష్ణుడి హిస్టరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

నిజానికి ఈ సినిమా ని 20-30 కోట్ల బడ్జెట్తో తీశారు కానీ బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలైన రెండు వారాల్లోనే ఈ సినిమా 70 కోట్ల వసూళ్లను నమోదు చేసుకుంది. ఇక హిందీలో కూడా ఈ సినిమా బాగానే ఆడుతూ ఉండడంతో త్వరలోనే సినిమా 100 కోట్ల కలెక్షన్ల మార్కును కూడా దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఒకవేళ ఈ సినిమా నిజంగానే వంద కోట్ల క్లబ్ లో చేరితే ఈ ఘనత సాధించిన మొట్టమొదటి నాన్ టైర్ టు హీరోగా

నిఖిల్ పేరు మారుమ్రోగుతుంది. ఇక అమెరికాలో కూడా ఈ సినిమా కలెక్షన్లు భారీగానే నమోదవుతున్నాయి. ఇక తెలుగులో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రొటీన్ కధలకు దూరంగా ఉంటూ సరికొత్త ఎక్స్పరిమెంటల్ సినిమాలతో కూడా బ్లాక్ బస్టర్లు అందుకుంటూ నిఖిల్ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు.

Tags:    

Similar News