Kantara Chapter 1: ‘కాంతారా చాప్టర్‌ 1’కు శాపమా..? వరుస అవాంతరాలపై నిర్మాత క్లారిటీ!

కన్నడలో విడుదలై పాన్‌ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని సాధించిన చిత్రం ‘కాంతారా’. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

Update: 2025-08-12 11:22 GMT

Kantara Chapter 1: ‘కాంతారా చాప్టర్‌ 1’కు శాపమా..? వరుస అవాంతరాలపై నిర్మాత క్లారిటీ!

కన్నడలో విడుదలై పాన్‌ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని సాధించిన చిత్రం ‘కాంతారా’. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా రిషబ్‌ శెట్టి ‘కాంతారా: చాప్టర్‌ 1’ను తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది. కానీ ప్రారంభం నుంచే వరుస ప్రమాదాలు, అడ్డంకులు తలెత్తుతుండటంతో, ‘‘ఇదేమైనా శాపమా?’’ అన్న చర్చ కన్నడ సినీ వర్గాల్లో మొదలైంది. దీనిపై నిర్మాత చలువే గౌడ స్పందించారు.

‘‘సినిమా షూటింగ్‌ సమయంలో దురదృష్టవశాత్తూ జరిగిన సంఘటనల్లో, ఒక్కసారి మాత్రమే సెట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. మిగిలినవి సినిమాకు సంబంధం లేని ఘటనలే’’ అని చెప్పారు. 2024 నవంబరులో కర్ణాటకలోని కొల్లూరు వద్ద జరిగిన ప్రమాదంలో చిత్ర బృందం గాయాలతో బయటపడింది. 2025 జనవరిలో సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎవరికి గాయాలు కాలేదు. తాజాగా రిషబ్‌ శెట్టి సహా కొంతమంది టీమ్‌ సభ్యులు పడవ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. అయితే కెమెరాలు, పరికరాలు నీటిలో మునిగిపోయాయి.

దేవుని అనుమతి తీసుకున్నాం

‘‘ఏ పని చేసినా దేవుని ఆశీస్సులు ఉండాలని మేము నమ్ముతాం. ‘కాంతారా: చాప్టర్‌ 1’ను ప్రకటించే ముందు, తుళునాడులోని పురాతన దైవం పంజుర్లిని దర్శించి, ఈ కార్యం విజయవంతం అవుతుందా? అని అడిగాం. అప్పుడే ‘కొన్ని అవరోధాలు ఎదురవుతాయి కానీ మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు’ అన్న సమాధానం వచ్చింది’’ అని నిర్మాత చెప్పారు.

చిత్రీకరణలో ఎక్కువ భాగం దట్టమైన అటవీ ప్రాంతాల్లోనే జరిగింది. ఉదయం 4 గంటలకు లేచి, 4.30కి రెడీ అయ్యి, 6 గంటలకు షూటింగ్‌ మొదలయ్యేది. 80% సన్నివేశాలు సహజ లొకేషన్స్‌లోనే చిత్రీకరించారు. నగరానికి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ప్రదేశాల్లో వాతావరణం తరచూ ఇబ్బంది కలిగించేది. సమయం వృథా కాకుండా కొన్ని యాక్షన్‌ సీన్లు వర్షంలోనే తీశారు. ఆలస్యాలు జరిగినప్పటికీ, ఫుటేజ్‌ చూసిన తర్వాత ఆ కష్టాలు వృథా కాలేదని అందరికీ అనిపించింది.

ఇప్పటికే షూటింగ్‌ పూర్తయిన ఈ మూవీ, అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Full View


Tags:    

Similar News