Kannappa: క‌న్న‌ప్ప‌లో ప్ర‌భాస్ ఎంత‌సేపు క‌నిపించ‌నున్నారో తెలుసా.? డార్లింగ్ ఫ్యాన్స్‌కి పండ‌గే

Kannappa: మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న పౌరాణిక చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్నో కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ భారీ ప్రాజెక్ట్‌ 2025 జూన్ 27న థియేటర్లలోకి రానుంది.

Update: 2025-05-27 08:33 GMT

పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో టాలీవుడ్ టూ బాలీవుడ్ వ‌ర‌కు అన్ని ఇండ‌స్ట్రీల‌కు చెందిన స్టార్లు న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌, మోహ‌న్ బాబు, మోహ‌న్‌లాల్‌, అక్ష‌య్ కుమార్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని భాష‌ల‌కు చెందిన న‌టులు ఈ సినిమాలో క‌నిపించ‌నున్నారు.

ఇక ఈ సినిమాలో ప్ర‌భాస్ రుద్రుడు పాత్రలో కనిపిస్తారు. ఆయన పాత్రకు సంబంధించిన సీన్లు సుమారు 30 నిమిషాల పాటు ఉంటాయని సమాచారం. మోహన్ బాబు మహాదేవ శాస్త్రిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. మోహన్ లాల్ కథకు బలమైన క్యారెక్టర్‌తో 15 నిమిషాల స్క్రీన్‌ స్పేస్‌ ఉన్న పాత్రలో నటిస్తున్నారు.

అలాగే అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతిగా కనిపించనున్నారు. వీరిద్దరూ కలిపి 10 నిమిషాల వరకు కనిపించే అవకాశం ఉంది. బ్రహ్మానందం, శరత్ కుమార్, మధుబాల, శప్తగిరి, రఘుబాబు, ముఖేష్ రిషి, యోగిబాబు, కరుణాస్, దేవరాజ్, మంచు అవ్రామ్, తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

కాగా విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా ఈ సినిమా కోసం పాట‌ను పాడారు. ఈ పాటను మే 28న శ్రీకాళహస్తిలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరో ముఖ్యమైన విషయం ఏమంటే, ఈ మూవీ నిడివి సుమారు 3 గంటలు 10 నిమిషాలు ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

సుమారు రూ. 200 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సినిమాకు స్టీఫెన్ దేవాసి సంగీతం అందించ‌గా, ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వ‌హించారు.

Tags:    

Similar News