Kanguva Movie First Review: కంగువా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే..?
Kanguva Movie First Review in Telugu: తాజాగా కంగువా (Kanguva) సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూను పోస్ట్ చేశాడు ఉమేర్ సంధూ.
Kanguva Movie Review
Kanguva Movie First Review in Telugu: సూర్య (Suriya) హీరోగా తెరకెక్కిన సినిమా కంగువా (Kanguva). అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పిరియాడిక్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ రూపొందించాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లతు దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రలను పోషించడంతో కంగువాకు పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్ వచ్చింది.
దేశవ్యాప్తంగా పలు భాషల్లో ఈ చిత్రాన్ని నవంబర్ 14వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఇక సినిమాను భారీ ఎత్తున విడుదల చేస్తున్న మేకర్స్ ప్రమోషన్స్‌ను కూడా అదే స్థాయిలో చేపడుతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. 1000 ఏళ్ల క్రితం 5 తెగల మధ్య సాగే పోరటాన్ని ఇతివృత్తంగ తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు.
ఈ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నాడు. పునర్జన్మ నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు అర్థమవుతోంది. ఇన్ని అంచనాల నడుమ వస్తున్న ఈ సినిమాపై భారీ క్యూరియాసిటీ నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూను పోస్ట్ చేశాడు ఉమేర్ సంధూ. దుబాయ్ సెన్సార్ బోర్డ్ స్క్రీనింగ్ సమయంలో సినిమాను వీక్షించానని తెలిపిన ఉమేర్ సినిమా రివ్వ్యూను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
కంగువా మూవీ అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపించారయన. మరీ ముఖ్యంగా సూర్య నటన చాలా బాగుంది అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అలాగే బాబీ డియోల్ నటన అద్భుతమని, దిశా పటాని సైతం తన పాత్రకు 100 శాతం న్యాయం చేస్తుందని పోస్ట్ చేశారు. కంగువా కచ్చితంగా ప్రతీ ఒక్కరూ చూడాల్సిన సినిమా అంటూ ఉమేర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.