తలైవి ఫస్ట్‌లుక్‌ రిలీజ్

Update: 2019-11-24 04:44 GMT
Thalaivi first look

దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత తమిళ రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. పుర్చటి తలైవిగా ప్రజల హృదయాల్లో నిలిచారు. సినీమాల్లోనూ తనదైన శైలిలో మెప్పించారు. తాజాగా జయలలిత నిజజీవితం ఆధారంగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో జయలలిత పాత్రలో బాలీవుడ్ నటీ కంగనా రనౌత్ నటిస్తున్నారు. కాగా.. శనివారం ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.

జయలలిత జీవితం ఆధారంగా తీస్తున్న ఈ చిత్రం తమిళ తెలుగు,హిందీ భాషల్లో విడుదల కానుంది. ఎంమ్జీఆర్ పాత్రలో అరవింద స్వామి, కరుణానిధి పాత్రలో ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారు. విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌. సింగ్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహిస్తన్నారు. శనివారం విడుదల చేసిన ఈ చిత్ర టీజర్‌లో జయలలిత పాత్రకు సంబంధించిన రెండు వేషధారణలకు విడుదల చేశారు. జయలలిత పాత గెటప్‌లో పాటు రాజకీయాల్లో సీఎంగా ఉన్న జయలలిత గెటప్ ను విడుదల చేశారు. కెప్టెన్‌ మార్వెల్, బ్లేడ్‌ రన్నర్‌ వంటి హాలీవుడ్ చిత్రాల నటీనటులకు మేకప్ వేసిన నిపుణులు నటి కంగనాకు కూడా జయలలితలా గెటప్ వేసి తీర్చిదిద్దారు. ఈ గెటప్‌లలో జయలలితను మరోసారి గుర్తుచేశారు.

Full View 

Tags:    

Similar News