Rajinikanth: సూపర్ రజనీకాంత్ హెల్త్ కండీషన్ పై కమల్ హాసన్ ఏం చెప్పారంటే?
Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆయన చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ సందర్బంగా రజనీకాంత్ కు నటుడు కమల్ హాసన్ లేఖ రాశారు. తన ప్రియమైన మిత్రుడు సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరగా కోలుకోవాలంటూ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

విలక్షణమైన నటుడిగా కమల్ హాసన్, యాక్షన్ హీరోగా రజనీకాంత్ సౌతిండియా సినీ ప్రపంచంలో దిగ్గజ నటులుగా పేరు సంపాదించుకున్నారు. వీరిద్దరూ కూడా కలిసి చాలా సినిమాల్లో నటించారు. కమల్ హాసన్, రజనీకాంత్ చాలా గ్యాప్ తర్వాత శంకర్ డైరెక్షన్ లో ఇండియన్ 2 షూటింగ్ లో మళ్లీ కలిసి యాక్టే చేశారు.
ఆసుపత్రిలో ఉన్న నా ప్రియమైన స్నేహితుడు సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇక రజనీకాంత్ గుండెకు సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారు. ఆయనకు స్టంట్ వేసినట్లుగా ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. రజనీకాంత్ ఇవాళ కానీ రేపు కానీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని తెలుస్తోంది. సోమవారం అర్థరాత్రి రజనీ కాంత్ చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తదుపరి పరీక్షల్లో గుండె ప్రధాన రక్తనాళంలో వాపు కనిపించినట్లు వైద్యులు చెప్పారు. శస్త్ర చికిత్స లేకుండానే ట్రాన్స్ కాథెటర్ చికిత్స ద్వారా సమస్య పరిష్కారం అయినట్లు ఆసుపత్రి మెడికల్ బులెటిన్ లో పేర్కొంది.