Kamal Haasan: కరోనా నుంచి కోలుకున్న కమలహాసన్
Kamal Haasan: గత నెల 22న ఆసుపత్రిలో చేరిన కమల్
కరోనా నుంచి కోలుకున్న కమల్ హాసన్ (ఫైల్ ఇమేజ్)
Kamal Haasan: విలక్షణ నటుడు కమలహాసన్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఈ మేరకు ఆయన చికిత్స పొందుతున్న చెన్నైలోని శ్రీరామచంద్ర ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గత నెల 22న స్వల్ప కొవిడ్ లక్షణాలతో తమ ఆసుపత్రిలో చేరారని హెల్త్ బులెటిన్‌లో వైద్యులు పేర్కొన్నారు. ఇప్పుడు కమల్ హాసన్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని. అయితే మరో రెండు రోజుల పాటు తమ సంరక్షణలోనే ఉంటారని చెప్పారు. రేపు ఆయనను డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. 4వ తేదీ నుంచి ఆయన యథావిధిగా తన పనులను ప్రారంభించవచ్చని చెప్పారు.