Kalki: అప్పుడే మొదలైన 'కల్కి' రచ్చ.. ట్రిపులార్‌ రికార్డ్‌ బ్రేక్‌ చేస్తూ..!

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాలను ఆకశాన్నంటేలా చేశాయి. ఇంత వరకు ఇండియన్‌ సినిమాలో కనిపించని సన్నివేశాలు, మేకింగ్ స్టైల్‌తో కల్కి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది.

Update: 2024-06-18 10:01 GMT

Kalki: అప్పుడే మొదలైన 'కల్కి' రచ్చ.. ట్రిపులార్‌ రికార్డ్‌ బ్రేక్‌ చేస్తూ.. 

Kalki: ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన 'కల్కి' మూవీపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగ అశ్విన్‌ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏకంగా రూ. 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాకుండా యావత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ వేయి కళ్లతో ఈ సినిమా కోసం ఎదురు చూస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాలను ఆకశాన్నంటేలా చేశాయి. ఇంత వరకు ఇండియన్‌ సినిమాలో కనిపించని సన్నివేశాలు, మేకింగ్ స్టైల్‌తో కల్కి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. జూన్‌ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోన్న ఈ చిత్రంపై ఊహకందని అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో ఉన్న రికార్డులను కల్కి తిరగరాయడం ఖాయమని చిత్ర యూనిట్ సైతం ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇదిలా ఉంటే కల్కి సినిమా ఇంకా థియేటర్లలోకి రాకముందే రికార్డులను తిరగరాయడం మొదలు పెట్టింది. ముఖ్యంగా ప్రీ బుకింగ్స్‌తో రచ్చ చేస్తోంది. ఓవర్సీస్‌లో కల్కి ప్రీ బుకింగ్స్‌ను ఇటీవల ఓపెన్‌ చేయగా గత రికార్డులన్నింటినీ తిరగరాస్తోంది. ప్రీ సేల్ బిజినెస్‌లో కల్కి మూవీ.. ట్రిపులార్‌ రికార్డును బ్రేక్‌ చేయడం విశేషం. మిలియన్‌ డాలర్ల ప్రీ సేల్‌ బిజినెస్‌ రికార్డు సృష్టించగా, ఇప్పుడు ఆ సేల్ రెండు మిలియన్‌ డాలర్లకు చేరుకుంది. కేవలం నార్త్‌ అమెరికాలోనే 2 మిలియన్‌ డాలర్ల బిజినెస్‌ జరగడం విశేషం.

విడుదలకు ముందే అత్యంత వేగంగా ఈ స్థాయిలో సేల్‌ జరిగిన తొలి భారతీయ సినిమాగా ‘కల్కి’ నిలిచింది. రిలీజ్‌కు ఇంకా 9 రోజుల సమయం ఉండడంతో ఇవి ఇంకా పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇక ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు 5000 టికెట్లు అమ్ముడయ్యాయని మూవీ యూనిట్‌ తెలిపింది. దీంతో విడుదలకు ముందే కల్కి రికార్డులు సృష్టిస్తుంటే, విడుదల తర్వాత ఇంకెన్ని వండర్స్‌ క్రియేట్ చేస్తుందోనని మూవీ లవర్స్‌ మాట్లాడుకుంటున్నారు.

ఇదిలా ఉంటే కల్కి సినిమాలో ప్రభాస్‌ హీరోగా నటిస్తుండగా ఈ చిత్రానికి నాగ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా దీపికా నటిస్తుండగా.. అమితాబ్‌, కమల్‌హాసన్‌, దిశాపఠాని వంటి అగ్ర తారలు నటిస్తున్నారు. మరి కల్కి బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి మ్యాజిక్‌ చేస్తుందో తెలియాలంటే మరో వారం రోజులు వేచి చూడాల్సిందే. 

Tags:    

Similar News