OTT Movie: ముస్లిం అమ్మాయి, హిందూ అబ్బాయి.. రివెంజ్ డ్రామాతో కూడిన యాక్షన్ మూవీ.. ఓటీటీలోకి వచ్చేసింది..!
OTT Movie: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత భాషతో సంబంధం లేకుండా సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.
OTT Movie: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత భాషతో సంబంధం లేకుండా సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఉంటే చాలు ఏ భాష సినిమా అనేది సంబంధం లేకుండా తెగ చూసేస్తున్నారు. ప్రేక్షకుల నుంచి లభిస్తోన్న ఆదరణతో ఓటీటీ సంస్థలు కూడా పెద్ద ఎత్తున ఇతర భాషల సినిమాలను తెలుగులోకి డబ్ చేస్తున్నారు.
మరీ ముఖ్యంగా కన్నడలో విడుదలై మంచి పేరు సంపాదించుకున్న చిత్రాలను తెలుగులోకి డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ కన్నడ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో సందడి చేస్తోంది. హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి లవ్ ట్రాక్‌తో నడిచే ఈ మూవీ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. కైవా అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు జయతీర్థ దర్శకత్వం వహించారు.
2023లో ఈ సినిమా కన్నడలో విడుదలైంది. ఈ మూవీలో ధన్వీర, మేఘా శెట్టి లీడ్ రోల్స్‌లో నటించగా నంద, రఘు శివమొగ్గ, ఉగ్రం మంజు, జాన్వీ రాయల, కార్తీక్ జయరామ్, దినకర్ తూగుదీప సహాయక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఈ సినిమా కథేంటంటే..
దేవరాజ్ అనే వ్యక్తి బెంగళూరు నగరాన్ని ఏలే ఓ గ్యాంగ్‌స్టర్. ఒక వ్యక్తిని చంపే విషయంలో పోలీసులకు దొరికి జైలుకు వెళ్తాడు. దేవరాజ్ జైల్లో ఉండగా చిల్లర రౌడీలు దందాలు చేయడం మొదలుపెడతారు. రామ్లాల్ అనే రౌడీ అందరినీ బెదిరిస్తుంటాడు. ఈ నేరాలు చేసి అక్రమంగా డబ్బులు సంపాదించే ముగ్గురు అన్నదమ్ములైన రౌడీలను రామ్లాల్ బెదిరించి అవమానిస్తాడు. ఆ రౌడీలు రామ్లాల్ పై పగ పెంచుకుని, అతనిని ఏమైనా చేయాలనుకుంటారు.
దేవరాజ్ గ్యాంగ్ స్టర్ కావడంతో అతనికి దగ్గర అవ్వాలనుకుంటారు. దేవరాజ్ శత్రువుని చంపి, అతని దగ్గర నమ్మకం ఏర్పరచుకోవాలనుకుంటారు. మరోవైపు ఓ జాతరలో హీరోకు సల్మా అనే అమ్మాయి పరిచయమవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకుంటారు. అయితే ఒకరోజు దేవరాజ్ శత్రువుని చంపడానికి వచ్చిన ముగ్గురు అన్నదమ్ములు, సల్మాని దారుణంగా కొట్టి అఘాయిత్యం చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న హీరో, వాళ్లను ఎలాగైనా పట్టుకుని చంపుతానని శపధం చేస్తాడు. మరి హీరో రౌడీలపై పగ తీర్చుకున్నాడా? రౌడీలు దేవరాజ్‌కు దగ్గర అవుతారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.