Junior Trailer: శ్రీలీల కొత్త సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రాజమౌళి

కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘జూనియర్‌’.

Update: 2025-07-11 14:28 GMT

Junior Trailer: శ్రీలీల కొత్త సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రాజమౌళి

కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘జూనియర్‌’. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, సీనియర్ నటి జెనీలియా కీలక పాత్రలో కనిపించనున్నారు. వారాహి చలనచిత్రం బ్యానర్‌పై రజనీ కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో జూన్ 18న ఈ చిత్రం విడుదల కానుంది.

ఇప్పటికే విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా “వైరల్ వయ్యారి” అనే ఐటమ్ సాంగ్‌కి విపరీతమైన క్రేజ్ వచ్చింది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్‌ను తెలుగు వెర్షన్‌ కోసం దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి లాంచ్ చేయగా, కన్నడ వెర్షన్ ట్రైలర్‌ను స్టార్ హీరో కిచ్చా సుదీప్ విడుదల చేశారు. ఈ చిత్రానికి సంగీతం అందించిన దేవీశ్రీ ప్రసాద్ సంగీత ప్రియులను అలరించనున్నారు.



Full View


Tags:    

Similar News