Tollywood: ఈ టాలీవుడ్ హీరో పెళ్లికి రూ. 100 కోట్లు ఖర్చయ్యాయి.. ఎవరో తెలుసా.?
Tollywood: భారతదేశంలో పెళ్లిని ఒక పండుగలా భావించి, పెద్ద ఎత్తున జరుపుకుంటారు.
Tollywood: ఈ టాలీవుడ్ హీరో పెళ్లికి రూ. 100 కోట్లు ఖర్చయ్యాయి.. ఎవరో తెలుసా.?
Tollywood: భారతదేశంలో పెళ్లిని ఒక పండుగలా భావించి, పెద్ద ఎత్తున జరుపుకుంటారు. అలాంటి వేడుకల్లో సెలబ్రిటీల పెళ్లి అయితే మరీ ప్రత్యేకమే. 2011లో టాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరో తన పెళ్లిని అద్భుతంగా జరిపారు. ఆ సమయంలోనే వివాహానికి మొత్తం రూ. 100 కోట్లు ఖర్చు చేశారు. ఇంతకీ ఆ హీరో ఎవరు.? ఆ పెళ్లి కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ స్టార్ హీరో మరెవరో కాదు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఆయన 2011 మే 5న లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నారు. ఇది సంప్రదాయ రీతిలో పెద్దలు కుదిర్చిన వివాహం. లక్ష్మీ ప్రణతి, వ్యాపారవేత్త నార్నే శ్రీనివాసరావు కుమార్తె.
ఈ వివాహ వేడుక హైదరాబాద్ మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరిగింది. ఒక్క పెళ్లి మండపానికే రూ.18 కోట్లు ఖర్చు చేశారు. మొత్తం ఈ వేడుకకు రూ.100 కోట్లు ఖర్చైనట్లు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పేర్కొంది. 3,000 మంది ప్రముఖులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు ఈ శుభకార్యంలో పాల్గొన్నారు. వధువు ధరించిన బంగారు కాంజీవరం చీర ఖరీదు రూ.1 కోటి కాగా, తారక్ పంచ-కుర్తాలో సంప్రదాయంగా కనిపించారు.
పెళ్లికి ముందు వివాదం:
వివాహానికి ముందు తారక్, ప్రణతి ఎంగేజ్‌మెంట్ జరిగిన సమయంలో, ఆమె వయస్సు 17 ఏళ్లు మాత్రమే. బాల్యవివాహ చట్టం ప్రకారం ఇది నిబంధనలకు విరుద్ధమని న్యాయవాది సింగులూరి శాంతి ప్రసాద్ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తారక్, లక్ష్మీకి 18 సంవత్సరాలు నిండే వరకు వెయిట్ చేసి, ఆ తరువాతే వివాహం చేసుకున్నారు. తద్వారా వివాదానికి ముగింపు ఇచ్చారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యామిలీ లైఫ్‌ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. 2014లో మొదటి కుమారుడు అభయ్ రామ్, 2018లో రెండో బాబు భార్గవ్ రామ్ జన్మించారు. ఎన్టీఆర్ తన కుటుంబ విషయాలను ఎక్కువగా పబ్లిక్‌లో షేర్ చేయకపోయినా, అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫ్యామిలీ ఫోటోలు పంచుకుంటూ అభిమానులకు ఆనందం కలిగిస్తుంటాడు.