Jr NTR: 'ఆట నాది, రూ.కోటి మీది' అంటూ ప్రోమో రిలీజ్ చేసిన ఎన్టీఆర్

Jr NTR: 'ఆట నాది, రూ.కోటి మీది' అంటూ మరో ప్రోమో రిలీజ్ చేసిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్

Update: 2021-03-21 09:31 GMT

Evaru Meelo Koteeswarulu

Jr NTR: భారీ ప్రాజెక్ట్స్ చేస్తూనే బుల్లితెర మీద కూడా తన సత్తా చాటుకుంటూ 'ఆట నాది, రూ.కోటి మీది' అని అంటున్నాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. ఈ షో జెమినీ టీవీలో 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' తో బుల్లితెర‌ ప్రేక్ష‌కుల ముందుకు ఎన్టీఆర్ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది. బుల్లితెర‌పై ఈ షో త్వ‌ర‌లో ప్రారంభం కాబోతున్న నేప‌థ్యంలో మ‌రో ప్రోమోను విడుద‌ల చేశారు. జీవితాన్ని మారుద్దాం రామ్మా అంటూ ఎన్టీఆర్ చెబుతోన్న డైలాగులు అల‌రిస్తున్నాయి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 'కౌన్ బనేగా కరోడ్ పతి' పేరుతో టెలికాస్ట్ అవుతూ దేశవ్యాప్తంగా గొప్ప ప్రజాదరణ పొందింది. ఇదే రియాలిటీ షోని తెలుగులో 'ఎవరు మీలో కోటీశ్వరులు' పేరుతో తీసుకు వచ్చారు. ఇంతక ముందు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున హోస్టులుగా నాలుగు సీజన్‌లు పూర్తి చేసుకుంది

భారీ మల్టీ స్టారర్ సినిమాలో...

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అన్నభారీ మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీంగా కనిపించబోతున్నాడు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా అన్నీ ప్రధాన భాషల్లో రిలీజ్ కాబోతోంది. 

Tags:    

Similar News