Jigris Teaser: ‘జిగ్రీస్’ టీజర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్.. ముఖ్య అతిథిగా సందీప్ రెడ్డి వంగా!

యువతను ఆకట్టుకునే కథాంశాలతో వస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘జిగ్రీస్’. చిన్ననాటి స్నేహితుల మాధ్యంలో జరిగే సరదా సంఘటనలు, గొడవలు, పంచ్‌లతో కూడిన ఈ సినిమా, ఓ దోస్త్‌ గ్యాంగ్‌ కథగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Update: 2025-08-06 17:12 GMT

Jigris Teaser: ‘జిగ్రీస్’ టీజర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్.. ముఖ్య అతిథిగా సందీప్ రెడ్డి వంగా!

యువతను ఆకట్టుకునే కథాంశాలతో వస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘జిగ్రీస్’. చిన్ననాటి స్నేహితుల మాధ్యంలో జరిగే సరదా సంఘటనలు, గొడవలు, పంచ్‌లతో కూడిన ఈ సినిమా, ఓ దోస్త్‌ గ్యాంగ్‌ కథగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కృష్ణ బురుగుల, ధీరజ్ అథేర్య, మణి వక్కా, రామ్ నితిన్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హరిష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తుండగా, కృష్ణ వోడపల్లి ఈ చిత్రాన్ని మౌంట్ మెరు పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

ఇప్పటికే టైటిల్, ఫస్ట్ లుక్‌ను అర్జున్ రెడ్డి‌, యానిమల్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా విడుదల చేయగా, టీజర్ రిలీజ్ ఈవెంట్‌కూ ఆయనే ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

ఈ నెల 8వ తేదీన రాత్రి 8 గంటలకు ఎల్‌బీనగర్‌లోని అర్బన్ మాయా బజార్‌లో టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ వేడుకలో సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా టీజర్ రిలీజ్ కానుంది.

ఇప్పటికే విడుదలైన పోస్టర్‌ యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. వింటేజ్ మారుతి 800 కారు పక్కన నలుగురు స్నేహితులు నిలబడి ఉన్న దృశ్యం nostalgiక థటును పెంచింది. స్నేహం, నానాటి స్మృతులు, అడ్వెంచర్, హాస్యం వంటి అన్ని ఎలిమెంట్స్‌తో ఈ సినిమా యువతకు కొత్త అనుభూతినివ్వబోతోందని మేకర్స్ చెబుతున్నారు.

ఈ టీజర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

Tags:    

Similar News